telugudanam.co.in

      telugudanam.co.in

   

ఈ గాలీ ఈ నేలా

ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు ||2||

నను గన్న నా వాళ్ళూ ఆ... నా కళ్ళ లోగిళ్ళూ||2||

ఈ గాలి ఈ నేల...

చిన్నారి గోరవంక కూసేను ఆవంక ||2||

నారాక తెలిసాక వచ్చేను నావంక

ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక

ఉప్పొంగిన గుండెలు కేక ఎగిసేను నింగిదాక

ఎగసేను నింగి దాకా...

ఈ గాలీ ఈ నేలా ఈ ఊరు సెలయేరు ||2||

నను గన్న నా వాళ్ళూ ఆ... నా కళ్ళ లోగిళ్ళూ||2||

ఈ గాలి ఈ నేల...

ఏనాడు ఏశిల్పి కన్నాడో ఈ కలలు ||2||

ఏ ఉలితో ఈశిలపై నిలిపాడో ఈ కళను

ఏవలపుల తలపులతో తెలిపాడో ఈ కధను ||2||

ఈ రాళ్ళే జవరాలై ఇట నాట్యా లాడేను ||2||

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: