telugudanam.co.in

      telugudanam.co.in

   

అందరమూ మానవులం

నారాయన నారాయణ అల్లా అల్లా

మా పాలిటి తండ్రీ, నీ పిల్లల మేమెల్ల || నారా ||

మతమన్నది నాకంటికి మసకైతే

మతమన్నది నా మనసుకు మబ్బయితే

మతం వద్దు గీతం అద్దు

మాయా మర్మం వద్దు || నారా ||

ద్వేషాలూ రోషాలు తెచ్చేదే మతమైతే

కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే

మతం వద్దు గతం వద్దు

మారణహొమం వద్దు || నారా ||

మతమన్నది గాంధీజీ హితమైతే

మతమన్నది లోకానికి హితమైతే

హిందువులం ముస్లిములం

అందరమూ మానవులం

అందరమూ

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: