www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

దేశభక్తిగీతం...

భారత దేశం మనదేర

||ప||    భారత దేశం మనదేర

భారతీయులం మనమంత

భారతదేశం మనదేర

1చ    భరతుడు ఏలిన రాజ్యముర

బుద్ధుడు పుట్టిన దేశముర

గాంధీ, నెహ్రూ, జనని ఇందిర

          రాణి రుద్రమ వెలసిన క్షేత్రం ||భా||

2చ    ఒకటే కులముగ కలిసుంటాం

          ఒకటే మతముగ నిలిచుంటాం

          గాంధీతాత చెప్పిన సూక్తులు

          మరవక మేము పాటిస్తాం ||భా||

3చ    జై జవానులమై రక్షిస్తాం

          జై కిసానులమై పండిస్తాం

          దేశం కోసం పిల్లలమంత

          తూటాలై మేము దూసుకు వెళతాం ||భా||

4చ    శాంతికి మేము దూతలము

          దేశభక్తికి వారసులం

          శత్రువు లెవరైన మా జోలికి వస్తే

          ఖబడ్దారంటు తరిమేస్తాం ||భా||

రచయిత్రి అప్పల బాలరత్నం

మూలం: శ్రీ వేంకటేశ్వర గానామృతము.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in