telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చేయెత్తి జైకొట్టుతెలుగోడా!

గతమెంతో ఘనకీర్తి గలవోడా!

సాటిలేని జాతి - ఓటమెరుగని కోట

నివురుగప్పి నేడు - నిదురపోతుండాది

జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా

గతమెంతో ఘనకీర్తి గలవోడా! ||చేయెత్తి||

వీర రక్తపుధార - వారబోసిన సీమ

పలనాడు నీదెరా - వెలనాడు నీదెరా

బాలచంద్రుడు చూడ ఎవడోయి!

తాండ్ర పాపయ్య గూడ నావోడూ ||చేయెత్తి||

కాకతీయ రుద్రమ, మల్లమాంబ, మొల్ల

మగువ మాంచాల నీ తోడ బుట్టినవాళ్ళే

వీరవనితలగన్న తల్లేరా!

ధీరమాతల జన్మభూమేరా ||చెయెత్తి||

నాగార్జునుడి కొండ, అమరావతీ స్థూపం

భావాల పుట్టలో - జీవకళ పొదిగావు

అల్పుడను కావంచు తెల్పావు నీవు!

శిల్పినని చాటావు దేశ దేశాలలో ||చెయెత్తి||

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం