telugudanam.co.in

      telugudanam.co.in

   

గాంధీ పుట్టిన దేశం

గాంధీ పుట్టిన దేశం

రఘురాముడు ఏలిన రాజ్యం

ఇది సమతకు మమతకు సంకేతం ||గాంధీ||

రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం

ఈశ్వర అల్లా తేరేనాం

సబకోసన్మతి దే భగవాన్

భేదాలన్నీ మరచి, మోసంద్వేషం విడిచి

మనిషి మనిషిగా బ్రతకాలి

ఏనాడూ నీతికి నిలవాలిః

బాపూః ఈ కమ్మని వరమే మాకివ్వు

అవినీతిని గెలిచే బలమివ్వు ||గాంధీ||

అవినీతిని గెలిచే బలమివ్వు ||రఘుపతి||

ప్రజలకు శాంతి సౌఖ్యం, కలిగించే దేశమే దేశం

బానిసభావం విడనాడి, ఏజాతి నిలుచునో అదిజాతి

బాపూః నీ చల్లని దీవెన మాకివ్వు

నీ బాటను నడిచే బలమివ్వు ||గాంధీ||

నీ బాటను నడిచే బలమివ్వు ||రఘుపతి||

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: