telugudanam.co.in

      telugudanam.co.in

   

నీ ధర్మం

నీ ధర్మం నీ సంఘం ను్వు మరవొద్దు

జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవొద్దు

సత్యంకోసం సతినే అమ్మినదెవరూ-హరిశ్చంద్రుడు

తండ్రి మాటకై కానలకేగినదెవరు-శ్రీరామచంద్రుడు

అన్న సేవకై అంకితమైనది ఎవరన్నా-లక్ష్మన్నా

పతియె దైవమని తరించిపోయెనదెవరమ్మా-సీతమ్మా

ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే నీ ధర్మం ||నీ సంఘం, జాతి||

చావకూడుతో సమతను నేర్చెను నాటి పలనాటి బ్రహ్మన్న

మేడిపండులా మెరిసే సంఘం గుట్టువిప్పెను వేమన్న

వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకును పండించే కందుకూరి

తెలుగుభారతిని ప్రజల భాషలో తీర్చిదిద్దెను గురజాడ

ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం ||నీ సంఘం, జాతి||

స్వతంత్రభారత రధసారధియై సమరానదూకే నేతాజీ

సత్యగ్రహమే సాధనమ్ముగ స్వరాజ్యమే తెచ్చె బాపూజీ

గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి

తెలుగువారి కొక రాష్ట్రం కోరి ఆహుతి అయ్యెను అమరజీవి

ఆ దేశ భక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం ||నీజాతి||

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: