telugudanam.co.in

      telugudanam.co.in

   

ఒక్కటేరా! తెలుగుదేశం

ఒక్కటేరా! తెలుగుదేశం

ఒకటేరా! తెలుగు భాష

ఎక్కడున్నా తెలుగులందరు

ఒక్కటేరా! ఒక్కటేరా!

ఒక్కటే గోదావరీ నది

ఒక్కటే కృష్ణానది

రెండు నదులూ తెలుగు జాతి

గుండెలో ఒకటైనవి || ఒక్కటే రా ||

అరకు లోయల గలికొండ

హైదరాబాద్ గోల్కొండ

కలిసి కట్టెను తెలుగుతల్లి

కంఠసీమను పూలదండ || ఒక్కటే రా ||

సాగరమ్ముక వైపున నిజాం

సాగరమ్ముక వైపున

తెలుగు తల్లిని వీచు చల్లని

అలల వీనన అదముప్పగ || ఒక్కటేరా ||

ఎదలు ఎదలు కూర్చి కట్టిన

ఏకతా సేతువుల మీద

కదలివచ్చీ అభ్యుదయ చ

క్రాల నడ్డుట చేటుగదా? || ఒక్కటేరా ||

నలుగు రెవరో తప్పుచేసిన

ఏడు కోట్లకు శిక్ష తగునా

ఎలుగ లేవో దూరినాయని

ఇంటినే తగలేయ తగునా || ఒక్కటేరా ||

పాడి తప్పక పాటు పడదాం

పంటలు పరిశ్రమలు పెడదాం

మెండుగా ఉత్పత్తి పెంచి

దండిగా అందరము ఉందాం || ఒక్కటేరా ||

పేదవోయిన తెలంగాణను

సెలవయిన సర్కారు ప్రాంతము

మధ్య భేధము మానివేద్దం || ఒక్కటేరా ||

ఆకలికి ఆవేశమునకు

అహంకృతికి ద్వేషమునకు

మంచి చెడ్డలు కానుపించవు

మంచి మాటలు వినుపుంచవు || ఒక్కటేరా ||

ఒక్క జాతిని రెండు ముక్కలు

ఒక్క గుండెకు రెండు చెక్కలు

చేయువాదెవడైన, ద్రోహము

చేయువాడే తెలుగు తల్లికి || ఒక్కటేరా ||

గోదావరి కృష్న నేడు

కూడి సాగగా

ప్రతి ఆంధ్రుని ఎద సమైక్య

భావమాడెగా! || ఒక్కటేరా ||

జాతిని చీల్చిన గోడల

జాడ మానెరా

మూగపడ్డ వీణ తిరిగి

మ్రోయ సాగెరా!

కలలు నిజములై కన్నుల || ఒక్కటేరా ||

కాంతి నించగా

చరిత్రలో స్వర్ణ యుగం

తిరిగి మొలిచెరా! || ఒక్కటేరా ||

గతమునుండి గుణపాఠము

గరచి మెలగరా

ద్వేషానైక్యతలు సమా

ధిలో పూడ్చరా! || ఒక్కటేరా ||

పేవవనం నాటు యద

శ్రీలు పూయగా

శ్ర్మామృతము చల్లు సుఖం

జాలు వారగా! || ఒక్కటేరా ||

పగిలిన ప్రతిశీతి గుండె

పదిల పడెనురా

ప్రతి జాతియు స్వీయ గృహము

ప్రవేశించెరా! || ఒక్కటేరా ||

జాతి జాతి కల భారతి

జాతి మనదిర

శాంతి క్రాంతి కోరు తెలుగు

జాతి మనదిరా || ఒక్కటేరా ||

సమైక్యత విశ్వప్రేమ

గీత పాడరా

నవ్య జీవితభ్యుదయో

త్సవము సేయరా || ఒక్కటేరా ||

గోదావరి కృష్ణ నేడు

కూడి పాడగా

మహొంధ్రోందయ సౌభాగ్య

మహిమ పాడరా! || ఒక్కటేరా ||

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: