telugudanam.co.in

      telugudanam.co.in

   

పాడనా తెలుగుపాట

పాడనా తెలుగుపాట పరవశమై నే

పరవశమై మీ ఎదుట మీ పాట

కోవెలగంటల గణగణలో గోదావరి

తరంగాల గలగలలో మావులతోపుల

మూపులపైన మసలేగాలుల గుసగుసలో

మంచిముత్యాల పేట

మధురామృతాల తేట ఒకపాట ||పాడానా||

త్యాగయ క్షేత్రయ రామదాసులు తనివితీర వినిపించినది

చక్కెర మాటలమూట చిక్కనితేనెల ఊట ఒకపాట ||పాడానా||

ఒళ్ళంత ఒయ్యారికోక కళ్ళకుకాటుక రేఖ

మెళ్ళోతాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమబొట్టు

ఘల్లుఘల్లున కడియాలందెలు అల్లనల్లన నడయాడే

తెలుగుతల్లి పెట్టనికోట - తెలుగునాట ప్రతినోట ఒకపాట||పాడనా||

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: