telugudanam.co.in

      telugudanam.co.in

   

ప్రజకూర్చిన రాజ్యాంగం

తరగలించె కాంతిరేఖ

భరతజాతి మస్తకమున

పరిమళించె విశ్వంభర

ఇరువది ఆరవ జనవరి ||తర||

పెదరాచరికపు చాయలు

చిరిగి చిరిగి చెరగిపోయె

తరిగిన మన భారతమ్మె

పరిపుష్టమై నిలచెను ||తర||

ఎలుగెత్తెను భారతమ్ము

వెలుగుల శంఖాలు నొత్తి

విజయ దుంధుభులే మ్రోగెను

ప్రజకూర్చిన రాజ్యాంగం ||తర||

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: