telugudanam.co.in

      telugudanam.co.in

   

తెలుగువీర లేవరా!

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా ||తెలుగు||

దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా||2||

నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా ||2||

నిదురవద్దు బెదరవద్దు నింగినీకు హద్దురా ||తెలుగు||

యెవడువాడు యెచటివాడు యిటువచ్చిన తెల్లవాడు

కండబలం కొండఫలం కబళించే దుండగీడు

మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు

తగినశాస్తి చెయ్యరా తరిమితరిమి కొట్టరా

ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి

ప్రతిమనిషి తొడలుగొట్టి శృంఖాలాలు పగులగొట్టి

చురకత్తులు పదునుపట్టి తుది సమరం మొదలుపెట్టి

సింహాలై గర్జించాలి సంహరం సాగించాలి

వందేమాతరం వందేమాతరం ||తెలుగు||

ఓ స్వాతంత్ర్య వీరుడా స్వరాజ్య భానుడా - అల్లూరిసీతారామరాజా

అందుకో మా పూజలందుకో రాజా అల్లూరి సీతారామరాజా

తెల్లవారి గుండెల్లో నిదురించినవాడాః

మా నిదురించిన పౌరుషాన్ని రగిలించినవాడాః

నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనే నడుస్తాం ||తెలుగు||

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: