telugudanam.co.in

      telugudanam.co.in

   

ఉగ్రనేత్రం తెరచి ఉరికింది తెలుగు

కడలి అంచులు దాటి కదిలింది తెలుగు

ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు

ఇటు మలేషియ నుంచి అటు అమెరికా వరకు

నలుదిశల గొంతుకల పలికింది తెలుగు

పెనుయెడారులలోన ఇనుప దారులలోన

పలుకు పలుకున జీవమలికింది తెలుగు

ఎక్కడున్న ఎన్ని చిక్కులున్న సరే

తలేత్తి నిలుపుమని తెలిపింది తెలుగు

ఏ భాష వేణుకైన ఏ వాన చినుకైన

తనలోన కలుపుకుని తరలింది తెలుగు

బరిగొదిగి పోతన్న బరవళ్ళతో సాగి

హమ్మంటు వేమనగ ఉరిమింది తెలుగు

అభినయానికి హృదయ మర్పించుకొని కూచి

పూడియే నాడిగా ఆడింది తెలుగు

సంగీతమే జీవసంపుటిగ త్యాగయ్య

ప్రతిపదంలో కరిగి పాడింది తెలుగు

పల్లె పాటలలో పభంధ నాటికలలో

కలికి బయ్యారాలు చిలికింది తెలుగు

స్వాతంత్ర్య సమరాన స్వచ్చంధగతులీన

ఉగ్రనేత్రం తెరిచి ఉరికింది తెలుగు

శాంతికి కపోతమైన క్రాంతి జలపాతమై

నిత్యవర్థిష్ణువై నిలిచింది తెలుగు

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: