www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల పాటలు (కొన్ని)

లేవరా మా బాబు

తొలిపొద్దు పొడిచింది, లేవరాబాబు

మొద్దు నిద్దుర వీడి మేలుకోవాలి

తూరుపుదిక్కున సూరీడు లేచాడు

పక్కపై నినుజూసి ఎర్రబడినాడు

ఆవుపొదుగు చూసి లేదూడ అరచేను

నాన్న ఎపుడో లేచి కళ్ళానికెళ్ళాడు

అమ్మ ఇప్పుడే చూడు కళ్ళాపు చల్లింది

రంగవల్లికలెన్నో అక్కవేసింది

బుద్దిసుద్దులు నేర్వ, బడికి పోవాలి

లేవరా మా బాబు! లేవరా తండ్రి!

[ వెనుకకు ]

ముద్దుబిడ్డలు

పిల్లల్లారా! బుడతల్లారా

నవ్వులు రువ్వే పువ్వుల్లారా

రాగాలొలికే పిట్టల్లారా

పాటలు పాడే కూనల్లారా

ఆడుతు,పాడుతు గడపండర్రా

బడిలో పాఠాల్ నేర్వండర్రా

ఆటల్లోనా పాటలున్నవీ

పాటల్లోనా నీతులున్నవీ

ఆటలు పాటలు నీతుల కథలూ

అన్నీ నేర్చే విజ్ఞులుకండీ

భరతమాతకూ ముద్దుబిడ్డలై

కన్నవారికీ పేరునుతెండీ

[ వెనుకకు ]

చదువు నేర్చుకుంటాం

పాలబుగ్గల పిల్లలం

పసిడి మొగ్గల మల్లెలం

కురిసే చిరుజల్లులం

మెరిసే హరివిల్లులం

జోలపాట మా అమ్మపాడు

నాన్నఉండు మాకు తోడు

అమ్మ, నాన్నల మాట వింటాం

కమ్మనైన కలలు కంటాం

గురువుగారే మాకు నేస్తం

వారికే మేం చనువు ఇస్తాం

చెప్పే చదువులు నేర్చుకుంటాం

నప్పే పదవులు కూర్చుకుంటాం!

[ వెనుకకు ]

బడి గంట మోగింది

బడి గంటదిగో బడి గంటదిగో

గణగణమోగెను బడిగంటదిగో

పలకా బలపం చేతను పట్టి

పుస్తకాల సంచి మూపునబెట్టి

పరుగున పోవాలి బడికి

వడిగా పోవాలి బడికి

అఆ ఇఈ ఉఊలన్నీ

అయ్యవారు దిద్దిస్తారంట

కాకి నక్కా, కుందేల్ తాబేల్

కథలు చెప్పి కవ్విస్తారంట

ఆటలు ఆడీ, పాటలు పాడీ

అందరినీ నవ్విస్తారంట

పరుగున పోవాలి బడికి

వడి వడి పోవాలి బడికి

[ వెనుకకు ]

తొలి బడి

ఇదిగిదిగో ఇది మా ఇల్లు

విశాలమైనది మా ఇల్లు..

అదుగో అక్కడ అమ్మా,నాన్నలు

ఆప్యాయతను చూపే దేవుళ్లు

"అమ్మా! అత్తా! తాతా! మామా!"

అమ్మ నేర్పిన కమ్మని పాఠం

"ఒకటీ రెండూ మూడూ ముప్ఫయ్"

చక్కగ లెక్కలు నేర్పును నాన్నా!

అన్నాతమ్ములు ఉన్నారిక్కడ

తిన్నగ ఆటలు ఆడుతు ఉంటాం

అక్కా చెల్లెళ్ళు ఉన్నారిక్కడ

చక్కగ పాటలు పాడుతు ఉంటాం

ఇదిగో తాతయ్య ఉన్నాడిక్కడ

కథలను వినమని చెబుతాడెప్పుడు

పలకాబలపం అక్కరలేదూ

పెద్దలె గురువులు నాబడికెప్పుడు

ఇదే! ఇదే! నా తొలిబడి!

మూలం: వార్తా, వార పత్రికలు, 2003,2004.

జన్మభూమి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన

పొగడరా నీ తల్లి భూమి భారతిని

నిలుపరా నీ జాతి నిండు గౌరవము.

[ వెనుకకు ]

వరిచేలు పండాలి

వానలు కురవాలి - వానదేముడా

వరిచేలు పండాలి - వానదేముడా

నల్లని మేఘాలు -వానదేముడా

చల్లగా కురవాలి - వానదేముడా

మావూరి చెరువంతా - వానదేముడా

ముంచెత్తి పోవాలి - వానదేముడా

కప్పలకు పెండ్లిండ్లు - వానదేముడా

గొప్పగా చేస్తాము - వానదేముడా

పచ్చగా చేలంత - వానదేముడా

పంటల్లు పండాలి - వానదేముడా

వానల్లు కురవాలి - వానదేముడా

వరిచేలు పండాలి - వానదేముడా


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in