telugudanam.co.in

      telugudanam.co.in

   

చదువు చారెడు... బలపాలు దోసెడు...

చారెడు అంటే ఒక చేతిలో పట్టేటన్ని దోసెడు అంటే రెండు చేతుల్లో పట్టేటన్ని పలకపైన రాయడానికి ఉపయోగించేవి బలపాలు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, షార్ప్‌నర్లు అని పిల్లలకోసం అమ్మానాన్న బోలెడంత దబ్బు ఖర్చు పెడతారు. కాని పరీక్షల్లోమాత్రం పెద్దలు ఆశించినన్ని మార్కులు రావు. ఎంతో కష్టపడి పిల్లలకోసం అన్నీ అమర్చుతుంటే, చదువులో మాత్రం పెద్దలు మాత్రం సరిగ్గా రాణించలెకపొతున్నరనే బాధలో,వారి వెనకబాటుతనాన్ని ఎత్తిచూపిస్తూ పెద్ద వాళ్లు ఈ సామెతను తరచుగా ఉపయోగిస్తుంటారు. అలాగే ఎదైనా పనికోసం ఎక్కువ సమయాన్ని, డబ్బును ఖర్చుపెట్టినప్పుడు అనుకున్నంత బాగా ఆ పని పూర్తికానపుడు 'చదువు చారెడు బలపాలు దోసెడు' అన్నట్టుగా వ్యవహారం ఉందంటూ నిరుత్సాహంగా చెప్పే సంధర్బంలో్ ఈ సామెతను వాడుతారు.


మూలం: 12-Dec-2008,శుక్రవారం, సాక్షి,ఫ్యామిలీ.


పెద్దల మాట పెరుగన్నం మూట

పెద్దవాళ్లు ఏదైనా చెప్పినపుడు దాని గురించిన పూర్తి వివరాలు మనకు లోతుగా తెలియక పెద్దగా పట్టించుకోం. కాని, వాటి వెనుక చాలా అనుభవం ఉందని చెప్పడమే ఆసామెత ఉద్దేశం. పూర్వం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దారి మధ్యలో తినడానికి అన్నం మూట కట్టుకుని వెళ్లేవాళ్లు. అలా తీసుకెళ్లేది పచ్చడి, కూరలు కాకుండా పెరుగన్నమైతే ప్రయాణంలో శరీరానికి వేడి చేయకుండా చలువ చేస్తుంది. పెద్దవాళ్లు చెప్పిన మాటల్లోకూడా భవిష్యత్తులో ఉపయోగపడే విషయం అంతర్లీనంగా ఉండే ఉంటుందని అర్థం.


మూలం: 6-Jan-2009, మంగళవారము, సాక్షి, ఫ్యామిలీ.


కుంచం అంత కూతురు ఉంటే మంచం మీదే కూడు

కూతురు ఉంటే అమ్మకు ఇంటిపనుల్లో సాయం చేస్తుందని ఇలాగంటారు. కుంచం అంటే ధాన్యం కొలిచే పాత్ర. ఇది పొట్టిగా ఉంటుంది. అంటే అంత చిన్న కూతురు ఉన్నా కూడా అమ్మకు కూర్చున్న చోటికే అన్ని అమరుతాయి అని అర్ధం. చిన్న వయసు నుంచే అమ్మకు సహాయం చేస్తూ ఉంటుందట, అలాగే కొడుకు నాన్నకు సహాయం చేస్తాడంటారు. పూర్వం ఇవి ఆడవాళ్లు చేసే పనులు, ఇవి మగవాళ్లు చేసే పనులు అంటూ విభజన ఉండేది కాబట్టి ఈ నానుడి వాడుకలోకి వచ్చింది కాని, ఇప్పుడు అమ్మాయైనా, అబ్బాయైనా సరే అమ్మకూ, నాన్నకు ఇద్దరికీ సహాయం చేయవచ్చు.


మూలం: 2-Jan-2009, శుక్రవారము, సాక్షి, ఫ్యామిలీ.


ఏ ఎండకాగొడుగు

వాన వచ్చేటప్పుడే కాదు ఎండలో బయటకు వెళ్లాలనుకున్నప్పుడు కూడా గొడుగు వేసుకుంటారు. అలాగే గొడుగును ఎప్పుడూ ఒకే రకంగా తల మీదకు వచ్చేటట్లు నిలువుగా పట్టుకోకూడదు. ఎందుకంటే సూర్యుడు గంటగంటకు పొజిషన్‌ మార్చుకుంటూ ఉంటాడు కదా మరి! కిరణాలు ఉదయం పూట తూర్పు వైపు నుంచి పడుతుంటాయి, మధ్యాహ్నం నిట్టనిలువుగానూ, సాయంత్రం పడమటి వైపు నుంచి పడుతుంటాయి. అందుకే మనం వెళ్లే దిశను బట్టి కిరణాలు పడే వాలుకు అడ్డుగా గొడుగు ఉండేటట్లు పట్టుకోవాలి. అప్పుడే ఎండ తాకిడినుంచి మనకు రక్షణ కలుగుతుంది. అంటే సమయానుకూలంగా మనలను మనం రక్షించుకోవడానికి తగిన సమయస్పూర్తితో వ్యవహరించాలని చెప్పడానికి అవకాశావాదిగా ఉన్నారని హేళన చేయడానికి ఈ సామెత వాడతారు.


మూలం: 8-Jan-2009, గురువారము, సాక్షి, ఫ్యామిలీ.


నీ నెత్తిమీద ఏదో ఉందంటే అదేదో నీచేత్తోనే తీయమన్నాడట

వెనుకటి రోజుల్లో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు. వాళ్లిద్దరూ అడవిమార్గంలో వెళ్తుండగా చెట్టుమీద ఉన్న పక్షి రెట్ట వేసింది. అది కాస్తా ఒకడి తల మీద పడింది. కొంత సేపటి తర్వాత పక్కనున్న స్నేహితుడు దానిని గమనించి "నీ తల మీద ఏదో ఉంది చూసుకో" అన్నాడు. దానికి అతడు ఏమన్నాడో తెలుసా? "తల మీద కదా ఉండేది? నాకెలా కనబడుతుంది? నాచేత్తో తడిమి చూసుకునే బదులు చూసిన వాడివి నువ్వే తీసేయవచ్చు కదా?" అని తిరిగి ప్రశ్నించడమే కాకుండా పక్షి రెట్టను తీసే పని కూడా చెప్పాడు. అలాంటి సోమరులను ఉద్దేశించి ఈ సామెతను చెబుతారు. మన హితవు కోరి జాగ్రత్త చెప్పిన వాళ్లతోనే ఆ పనికూడా చేయించుకోవాలనే తత్వం అది. చెల్లి కాని తమ్ముడు కాని మాసిన సాక్స్‌ను ఉతకడానికి వేయకుండా ఆలాగే ఉంచేస్తున్నప్పుడు, మరుసటి రోజు వాటినే వేసుకుంటారేమోనని మీరు తీసేయమని సలహా ఇచ్చారనుకోండి. అప్పుడు వాళ్లు మీసాక్స్‌తో పాటు వాటీని కూడా ఉటాకడానికి వేసేయమంటే ఎలా ఉంటుంది? అలాంటి సందర్భం అన్నమాట.


మూలం: 9-Jun-2009, సోమవారము, సాక్షి, ఫ్యామిలీ.


[ వెనుకకు ] [ సామెతలు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: