|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సూక్తులు
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
త నుంచి న వరకు
తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు
తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం.
తన జానెడు పొట్టకు బానిస అయిన వ్యక్తి భగవంతుణ్ణి ససేమిరా పూజించలేడు.
తన తోటివారికి ఎంతవరకు సహాయపడతాడో అంతవరకే మనిషి గొప్పవాడవుతాడు.
తన తోటివారికి చేసిన మంచే మనిషి నిజమైన సంపద
తన దోషాలను గుర్తించకపోవటాన్ని మించిన పొరపాటు లేదు.
తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రతివ్యక్తి ఒక వాస్తుశిల్పే.
తనకోసం పాటు పడటం సంతృప్తిని ఇస్తుంది. కాని ఇతరుల కోసం పాటు పడటం ఉత్తేజం కలిగిస్తుంది.
తనకు అర్ధం కాని వాటిలో మనిషికి మరింత నమ్మకం.
తనకు ఇష్టమైన పనిని గొప్ప మూర్ఖుడు కూడా పూర్తిచేయగలడు. కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు.
తనకు నచ్చిన పనిని ప్రతివాడు చేస్తాడు. కానీ చేస్తున్న పనిని ఇష్టపడేవాడికే నిజమైన సంతోషం లభిస్తుంది.
తనను తానే నమ్మని వ్యక్తి ఎవరినీ నమ్మలేడు.
తనలోని పసి హృదయాన్ని పోగొట్టుకోని వ్యక్తే గొప్పవాడు.
తను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు.
తాను పుట్టిన నేలనీ, దేశాన్ని ప్రేమించలేని వాడు దేనీని ప్రేమించలేడు.
తాను లూటీ చేసిన పుష్పాన్నే తేనెటీగ ఫలవంతం చేస్తుంది.
తాను శ్రమించిన పనివల్ల అతడికి లభించే ఫలితమే కాకుండా అతడు మారిన విధమే అతిగొప్ప బహుమతి అవుతుంది.
తినుటకై జీవించు వాడు బుద్దుడు. జీవించుటకై తినువాడు ముక్తుడు.
తప్పు చేయని వారు ధరణిలో లేరు.
తప్పులను చేయని వ్యక్తి సాధారణంగా ఏమి చేయలేడు.
తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ మూర్ఖుడు తప్పులు చేస్తూనే ఉంటాడు.
తప్పులు పట్టవద్దు. తప్పులు దూరం చేయగల మార్గాలను వెతుకు.
తమ చావుకు ముందే పిరికివాళ్ళు అనేకసార్లు మరణిస్తారు.
తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి మించిన కర్తవ్యం ఎవరికీ లేదు.
తమకాలాన్ని దుర్వినియోగం చేసేవారు కాలం తక్కువగా ఉన్నదని ఎక్కువగా ఫిర్యాదు చేస్తారు.
తమకు తామే సహాయాన్ని చేసుకునేవారికే దేవుడు సహాయపడతాడు.
త్యాగమయ జీవితం మహత్తర జీవితం.
తీరిక లేకుండా పనిచేసే వ్యక్తే అతి సంతోషంగా ఉన్న వ్యక్తి.
తీర్మానాలు చేస్తే చాలదు. వాటిని ఆచరణలో పెట్టాలి.
తలమీద జుట్టు అందాన్నిస్తుంది. తలలోని జ్ఞానం గొప్పదనాన్ని కలిగిస్తుంది.
తెలియని మూర్ఖుని కంటే అన్ని తెలిసిన మూర్ఖుడు అవివేకుడు.
తెలివితక్కువతనాన్ని తెలుసుకోలేనంత తెలివితక్కువతనం మరొకటి ఉండదు.
తెలివితేటలంటే విన్నదాంట్లో సగాన్ని మాత్రం విశ్వసించడం.
తెలివితేటలు ఉన్నంత మాత్రాన ఎవరూ రచయితలు కాలేరు. ప్రతి పుస్తకం వెనుక ఒక వ్యక్తి ఉన్నప్పుడే అతడు రచయిత అవుతాడు.
తెలుసు కోవటం కంటే తెలుసుకున్న దానిని జీర్ణించుకోవటం ముఖ్యం.
తెలుసుకోడం కాదు, ఆచరించడమే కష్టం - షూకింగ్.
తొందరపడకండి. విజయానికి అవసరమైనవి చిత్తశుద్ధి - ఓర్పు - పట్టుదల.
త్వరగా ఇచ్చేవాడు రెండు పర్యాయాలు ఇచ్చినట్లే.
తీసిన కొద్దీ చెలమలో నీరు ఊరినట్టు చదివిన కొద్దీ మనిషి 'వివేకం' పెరుగుతుంది.
తుఫానులో చేసిన ప్రమాణాలను ప్రశాంతంలో మరచిపోతాం.
తృప్తి అమూల్యమైన ముత్యం. పదివేల కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు.
తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది.
తృప్తితో నిన్ను నీవు బలపరచుకో, అది ఎవరూ జయించలేని కోట.
దేని స్థానంలో అది ఉంటేనే ఉపయోగం ఉద్యానవనంలో ఆవు ఉండడం వల్ల ఏం లాభం?
దేన్ని చూసైనా సరే భయపడవద్దు! మీరు అద్భుతాలు సాధిస్తారు! భయపడిన మరుక్షణo, మీరు ఎందుకూ కొరగాని వారయిపోతారు.
దైన్యం రకరకాల వ్యక్తులతో పరిచయం కలిగిస్తుంది.
దీపపు వెలుగు నూనెపై ఆధారపడి ఉంటుంది.
దయ అనబడే బంగారు గొలుసుతో మనుషులు ఒకటిగా చేర్చబడ్డారు.
దయ తాళం వేయబడ్డ హృదయాల్ని తెరవగల సరైన తాళం చెవి.
దయార్థ హృదయంకు ధర చెల్లించవలసిన అవసరం లేదు.
దారి మాత్రం తెలిసి వాహనం నడిపే కళతెలియని వ్యక్తిని విమర్శకుడు అంటారు.
దారిద్య్రం దుర్గుణం కాదు, అసౌకర్యం మాత్రమే.
దైవ భక్తికి అర్ధం - ఆదర్శాల పట్ల ప్రేమ.
దైవకార్యంలో పాల్గొనే అవకాశం కలిగిన వాడే అందరినీ మించిన అదృష్టవంతుడు.
ద్వేషం కంటే కూడా ప్రేమ అన్నది చాలా శక్తివంతమైనది.
ద్వేషాన్ని పోషించే వారిని ద్వేషం హతం చేస్తుంది.
దేవుడికీ, మనిషికీ మధ్య ఉన్న అద్భుత వంతెనే ప్రార్ధన.
దేవుడు సత్యం. దేవుడు బ్రహ్మానందం. దేవుడు సౌందర్యం.
దేవుని ప్రేమించటం జీవిత లక్ష్యం, దేవునితో ఐక్యం చెందటం జీవిత గమ్యం.
దేశకాల పరిస్థితులకు అతీతమైనది సంస్కృతి.
దూరపు కొండలు నునుపుగా తోచు.
దృఢనిర్ణయం అన్నది విజయపథంపై మనం మొదటి అడుగు అవుతుంది.
దృఢమైన హృదయమే దురదృష్టాన్ని ధ్వంసం చేయగలదు.
దృశ్యాన్ని దూరమే మోహింపచేస్తుంది
ధనమే ఆనందం కాదు. ధనవంతులందరూ ధనం కారణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు.
ధనవంతుడి జోకులు ఎల్లప్పుడూ తమాషాగానే ఉంటాయి.
ధనవంతుడిగా మరణించడం కంటే ధనవంతుడిగా జీవించడం హాయి.
ధైర్యం కేవలం పురుషుడి సొత్తు కాదు. మగవారిలాగా స్వతంత్రులం అని స్త్రీలు భావించాలి.
ధైర్యంతో పనులను చేపట్టేవారినే విజయలక్ష్మి వరిస్తుంది.
ధృడమైన మనస్సును కలిగి ఉన్నవారు అంధకారంలో కూడా కాంతిరేఖను చూడగలరు.
నీ అంగీకారం అనేది లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవ్వరూ తగ్గించలేరు.
నా అదృష్ట దురదృష్టాలకు భాధ్యుడను నేనే.
నీ ఆలోచనలను, శీలాన్ని, స్వభావాన్ని పవిత్రం చేసుకో; ప్రగతి పొందు.
నీ ఇరుగు పొరుగువారిని నీ వలెనే ప్రేమించు. నీ దేశాన్ని నీకంటే అధికంగా ప్రేమించు.
నీ తప్పును ఒప్పుకోవడం వలన నిన్నటి కంటే నేడు నీవు వివేకవంతుడవని తెలుస్తుంది.
నీ పట్ల ఇతరులు ఆసక్తి చూపాలనుకోవడం కంటే ఇతరుల పట్ల నీవు ఎక్కువ ఆసక్తి చూపినప్పుడు ఎక్కువ స్నేహితులను పొందవచ్చు.
నీ భార్యా పిల్లలను ప్రేమించినంతగా నీతల్లి తండ్రులను ప్రేమించు.
నీకై నీవు మంచిగా ఉండటం - ఎంతమాత్రం ప్రయోజనం లేనిది.
నాకు గతాలు లేవు. కాలం వాటిని కబలించింది. రేపు అన్నది లేకపోవచ్చు. కానీ ఈ రోజు మాత్రం నా దగ్గరుంది.
నాకు నచ్చని వాటిని మరచిపోవడం, నాకు నచ్చిన వాటిని ఆచరించడం నా అలవాటు.
నిగ్రహించడమే ఆత్మ నిగ్రహం బాటపై మనం వేసే మొదటి అడుగు అవుతుంది.
నిఘంటువులో మాత్రమే 'విజయం', 'సాధనకు' ముందు వస్తుంది.
నిజం ఉన్నతమైనది కాని నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది.
నిజం కానిది నిజంగా గొప్పది కాదు.
నిజం తరచుగా కనుమరుగవుతుందే కాని నిర్మూలించబడదు.
నిజంగా విజయాలను సాధించాలనుకొనేవారు తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు.
నిజానికి మించిన మతం ఈ ఇలలో లేదు.
నిజాన్ని ఆమోదించని వారితో ఏం వాదించి లాభం ఉండదు.
నిజమే ఎప్పుడూ బలమైన వాదన అవుతుంది.
నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము.
నిజము నిలకడ మీద తెలియును.
నిజాయితీని కోల్పోయిన వ్యక్తి వద్ద కోల్పోవడానికి మరేమీ మిగిలి ఉండదు.
నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.
నిజాయితీని మించిన వంశపారంపర్య ఆస్తి మరొకటి లేదు.
నిజాయితీపరుడైన వ్యక్తి భగవంతుడి భవ్యసృష్టి.
నీటితో శరీరం శుద్ది పొందినట్లే -, సత్యం చేత మనస్సు, జ్ఞానంచే బుద్ది, విద్యచే ఆత్మశుద్ధి కలుగుతాయి.
నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది.
నీతో వ్యర్ధ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్ధ ప్రసంగం చేస్తాడు.
నీతిగల వానికి నిందాభయం లేదు.
నిన్న సత్యమై నేడు అసత్యమయ్యేది సత్యం కాదు.
నిన్నటి గురించి మదనపడకుండా రేపటి గురించి భయపడకుండా ఆలోచించగలిగిన మనిషికి విజయసోపానాలు అందినట్లే.
నిన్ను గురించి నీవు తెలుసుకోవడం ధ్యానంలో ఒక భాగం.
నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది.
నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను
నమ్మకమే ఒకరు ఇంకొకరికి ఇచ్చుకోగల ఉత్తమోత్తమ కానుక అవుతుంది.
నమ్మిన సిద్దాంతాలకోసం ప్రాణం బలిపెట్టడానికి సిద్దంగా ఉండేవారికి ఓటమి ఉండదు.
నిమిషాలను జాగ్రత్తగా వాడుకోండి. గంటలు తమ జాగ్రత్తని తాము చూసుకోగలవు.
న్యాయం గెలుస్తుందన్న మాట నిజమేకాని గెలిచేదంతా న్యాయం కాదు.
నిరాడంబరమైన, యదార్ధమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
నిరాడంబరమైన,.యదార్థమైన వ్యక్తే నిజంగా గొప్ప వ్యక్తి.
నిర్భాగ్యునికి నిద్ర, అభాగ్యునకు ఆకలి ఎక్కువ.
నిర్మలమైన మనసు కలిగి ఉండటం కన్నా గొప్ప శాంతి లేనేలేదు.
నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని, వివేకానికి కాదు.
నాలుకా, నాలుకా వీపుకు దెబ్బలు తేకు.
నలుగురి ముందు ఇవ్వబడిన స్నేహపూర్వకమైన హెచ్చరిక బహిరంగ మందలింపుతో సమమైంది.
నలుగురు నడిచిందే బాట - నలుగురు పలికిందే మాట
నలుగురు నడిచిందే బాట - నలుగురు పలికిందే మాట.
నవ్వండి మీతో ప్రపంచం కూడా నవ్వుతుంది. ఏడవండి మీరు మాత్రమే ఏడవాలి.
నవ్వని దినం పోగొట్టుకున్న దినం.
నవ్వలేని వాడికి ప్రపంచమంతా పగలే చీకటిగా మారుతుంది.
నీవు ఎలా కావాలనుకుంటే అలాంటి భావాలను, నీ మనస్సులో నాటుకో.
నీవు ఒక పొరబాటు చేసి, మరో కొత్త పొరబాటు చేసేందుకు అనుభవం సంపాదించుకుంటావు.
నష్టంలో కష్టంలో దేవుడు గుర్తొస్తాడు.
నిస్వార్ధంగా తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేయగలిగిన వాడికి ఏ నాడూ ఏ లోటూ ఉండదు.
నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in