|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్..
|
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సామగానం
'వేదానాం సామవేదోస్మి ' అంటాడు కృష్ణ పరమాత్మ. భగవధ్గీత
విభూతి యోగంలో. రుక్ వేదం- రుక్కులతో కూడినది. ఎవరైనా కంఠోపాఠం చేశారు
అనడానికి 'రుక్కు పెట్టేశాడు ' అంటారు. రుగ్వేద అధ్యయనం చేసినప్పుడు అనేమాట
ఈనాటికీ వాడుకలో ఉన్నది. రెండవది యజు: -యజుర్వేదము, యజు: అంటే యాగం
యాగంచేసేటప్పుడు వల్లెవేసేదే యజుర్వేదం. పై రెండువేదాలకూ కృష్ణ పరమాత్మ ప్రాధాన్యం ఇవ్వలేదు.
క్రమంలో మూడొవదైన 'సామ 'వేదానికే ప్రాధాన్యతను ఇచ్చాడు. సామవేదం గానంచేయ దగినది
మిగిలినవి సమంత్రకంగా ఉచ్చరించేవి.
సరస్వతి వీణపేరు కచ్చ్పి. ఆ వీణాతంత్రుల్లోనుంచి వచ్చేది గానం. అందుకే గాయకులందరూ గానం ప్రారంభించేముందు ఆతల్లిని స్మరిస్తారు. నారదుని వీణపేరు మహతి. అందులోనుంచి నారాయణ నారాయణ అనివినిపించేది సామవేదమే! అందుకే 'దేవర్షీణాం చ నారద:' అంటాడు గీతాచార్యుడు. గజేంద్రుణ్ణి రక్షించవలసివచ్చినప్పుడు 'అభ్రగపతిన్ పన్నింపడు' - తనను వాహనంకింద వాడుకోకుండా నేరుగా వెళ్ళిపోయాడు మహావిష్ణువు. దీనుల ఆర్తనాదంవిని తనను వాహనంగా వినియోగించుకోకపోతే తనెందుకున్నాట్టు అని బాధపడ్డాడు గరుడు. అందుకని ఆతడు కంచిలోని వరదరాజస్వామి రూపంలో ఉన్న విష్ణుమూర్తిని అంటిపెట్టుకొనిస్వామి సన్నిధానంలోనే ఉంటాడు. 'అయినా మనకెందుకీ కంచి గరుడసేవ ' అనే నానుడి వాడుకలోకొచ్చినది.
'వైనతేయశ్చ పక్షిణాం ' అంటాడు కృష్ణ పరమాత్మ. కశ్యప ప్రజాపతి భార్యలలో మొదటిది వినతి. వినతి కుమారుడే వైనతేయుడు. అతడే గరుత్మంతుడు. గరుత్మంతుని వీపుమీద కూర్చొని ఆపదలోఉన్నభక్తులను ఆపదలోఉన్న భక్తులను రక్షించడానికి సన్నధమౌతాడు. ఆయన కూర్చున్నాక గరుత్మంతుడు ఎగురుతుంటే ఆ రెక్కలలోనుంచి వినిపించేది సామగానమే.
'గంధర్వాణాం చిత్రరధహ:' అంటాడు మళ్ళా శ్రీకృష్ణ భగవానుడు. 'గందర్వగానం ' అంటారు. గంధర్వలోకంలో శ్రావ్యంగా పాడేవారుంటారు అంటారు.బాలక్రిష్ణ భగవానుడు గోకులంలో 'భాండీరం ' అనే మర్రిచెట్టి కింద వేణువు ఊదుతున్నప్పుడు గంధర్వగానం వినవచ్చినది. అందుకే పోతన
"మౌళిపించంబు, కంఠ దామమును మెరయ
విలసిత గ్రామంగ ఒక్క వేణువందు
'బ్రహ్మ గాంధర్వగీతంబు ' పరగజేసి
చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి"
అంటాడు. విష్ణుసహస్రనామస్తోత్రంలో ఒకచోట వైభవ స్సామగాయన: అని వస్తుంది. విఖనసమహర్షి కుమారుడే వైఖానసుడు. ఆయన శ్రీరాముని కొలువులో సామగానం చేసేవాడు. భీష్ములవారు ఆయననే ప్రస్తావించారు. ఆ వైఖానస సాంప్రదాయానికి చెందినవారే నేడు తిరుమల, సింహాచలం, శ్రీరామతీర్ధం దేవస్తానాల్లో అర్చకస్తం చేస్తున్నారు. నేడు జాతీయ సంగీతాన్ని ఎవరు గానంచేస్తున్నా దానికి మూలం సామగానమే.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 20-11-2007 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in