|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
క్రైస్తవుల జానపద కళా ప్రదర్శనలు
క్రైస్తవ కథా గానాన్ని రచించిన ప్రధమ కవి పిడతల జాన్ కవి. ఈయన భారత పురాణాలనూ, హరికథలనూ విని, గ్రహించి వాటిలోని మెళకువలను తెలుసుకుని బైబిలులోని ఘట్టాలను అనుసరించి హరికథా కాలక్షేపాలుగా మలిచారు. వాటిలో ఆదాము-అవ్వ, క్రీక్స్తు జననం పేర్కొనదగినవి. అలాగే మందపాటి భాగవతార్ ఏసు చరితమును రచించారు.
కథ పాత నిబంధనకు సంబంధించినదైతే యెహోవాను, కొత్త నిబంధనకు సంబంధించినదైతే ఏసు క్రీస్తును ప్రార్ధిస్తారు.

హరికథలే కాక ఏసు క్రీస్తును కీర్తిస్తూ కోలాటపు పాటలు కూడా రచించడం, వాటిని ప్రదర్శించడమూ జరుగుతున్నది. ఇక ప్రజలకు అత్యంత చేరువైన బుర్రకథను కూడా కొందరు రచించి, ప్రదర్శించారు. బుర్ర కథల ద్వారా ప్రజా సమస్యలను బయటపెట్టేవారు. అంతేకాకుండా అనేక భజన పాటలు కూడా రచించబడ్డాయి. ఇతర కళా రూపాల మాదిరే క్రైస్తవులు తమ ప్రదర్శనలను పెండిండ్ల సమయాల్లోనూ, పండగల సమయాల్లోనూ, ఇతర ప్రత్యేక దినోత్సవాలలోనూ ప్రదర్శిస్తారు. క్రైస్తవ సాహిత్యం జానపద కళలన్నింటిలోనూ ఉండడం విశేషం.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in