www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

తప్పెటగుళ్ళు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రచారంలో ఉన్న జానపద కళారూపమిది. ఇది సంప్రదాయ నృత్యం.వర్షాలు పడక పశుగ్రాసం కష్టమైనప్పుడు దైవానుగ్రహంకోసం గొల్ల కులస్తులుఈ నృత్యం చేస్తారు. తప్పెటలను గుండెలకు వ్రేలాడగట్టుకుని వాటిని వాయిస్తూ నృత్యం చేస్తారు. ఇది జానపద సంగీత నాట్య దృశ్య రూపకం. రేకుతో గుండ్రంగా తయారుచేసిన తప్పెటలాంటి ఒక్ వాయిద్య పరికరాన్ని రొములపై కట్టుకుని రెండు చేతులతోనూ, వివిధ గతులలో, ఉధృతంగా వాయిస్తూ, కాళ్ళకు గజ్జెలు కట్టి ఒకే విధమైన రంగుల నిక్కర్లను తొడిగి, ఆనందంతో వలయాకారంగా తిరుగుతూ, శాస్త్రీయమైన అడుగులతో సుదీర్ఘ రాగాలతో ఆలాపన చేస్తూ, మృదు మధురమైన సంగీతంతో ప్రేక్షకులను రంజింపజేస్తారు. లయబద్ధంగా నృత్యం చేసే ఈ బృందాలలో ఇరవై మంది వరకు కళాకారుల వరకూ ఉంటారు. ఎంతమందున్నా వారు సమర్ధులై ఉంటారు. ప్రదర్శన పతాక స్థాయికి చేరుకోగానే సర్కస్‌లో మాదిరిగా ఆషర్యకరమైన ఫీట్లు చేసి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తారు. తప్పెటలు వాయిస్తూనే నెమ్మదిగా ఒకరిపై ఒకరు ఎక్కుతూ అంచెలంచెలుగా గోపుర ఆకారంగా నిలబడతారు.

వీరు చెప్పే ముఖ్యమైన కథ గంగమ్మ కథ. గంగమ్మను వారు కుల దేవతగా ఆరాధిస్తారు. ప్రదర్శన ఎంతో భక్తిభావంతో జరుగుతుంది. ప్రదర్శనలో ఏమాత్రం పొరపాటు జరగకుండా ఎంతో జాగ్రత్తతో చేస్తారు. దశావతారాలు, కృష్ణలీలలు వంటి కథా గేయాలు కూడా పాడుతూ సన్నివేశాలకు అనుగుణమైన అభినయాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన నాలుగైదు గంటలపాటు జరుగుతుంది.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in