|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
భజన కూటములు
మన గ్రామాలలో ప్రతిచోటా దేవుని మందిరం - ప్రార్థన మందిరం లేకుండా లేదు. ఇక్కడ నృత్యం చేస్తూ, చిరుతలు, తాళములు పుచ్చుకొని, కాళ్ళకు గజ్జలు గట్టుకొని "హరిలో రంగ హరీ"...అంటూ అడుగులు వేస్తూంటే భక్తి పారవశ్యంలో మునిగిపోతాం. వేదకాలంనుంచీ ఈనాటివరకూ ప్రజలను భక్తి మార్గంలోనికి పయనింపజేసే కళా రూపాలలో ప్రముఖ పాత్ర వహించేవి భజన కూటాలు. భక్తి పారవశ్యంతో చేసే ఈ భజనలను బృందంగా చేస్తారు. కొందరు కూర్చుని చేస్తే, మరికొందరు ఆదుతూ, చిందులేస్తూ చేస్తారు. భజనలలో అష్టపదులు, కీర్తనలు, గేయాలూ ఉంటాయి. వీటిని చెక్కలతోనూ, చిరతలతోనూ, తాళాలతోనూ, కాళ్ల గజ్జెలతోనూ చేస్తారు.

బృందాలలో కొన్ని ఒకే విధమైన వస్త్ర ధారణ కలిగుండి క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తారు. వారిలో ఒక్కరు కూడా లయ తపకుండా, ఒకే శృతిలో, ఒకే కంఠంతో చేస్తారు. ఈ భజన పాటల్లో భగవంతుణ్ణి కీర్తించడం, వేడుకోవడం, వర్ణించడంతోపాటు నిష్టూరాలాడడం వంటి భావాలు కూడా ఉంటాయి. కొన్నిటిలో వైరాగ్యం కూడా ఉండడం సర్వసాధారణం. కూచిపూడి భాగవతులు శ్రీకృష్ణ జన్మాష్టమి మొదలయిన పండుగలో అనేక మంది సాతాని భక్తులూ - నామాలు ధరించి, దీపపు సమ్మె పుచ్చుకొని గానం చేయడం కద్దు. భజన సమాజములో నృత్యం చేసేవారు 20 మంది దాకా ఉంటారు. ఇటువంటి భజనలలో నోటితోపాట, చెక్కల ద్వారా తాళం, గజ్జెలు, అలంకరించిన కాళ్ళతో నృత్యం - చూడడానికి, వినడానికి ముచ్చటగా ఉంటుంది. దీనిని లయతప్పకుండా ప్రదర్శించాలి. శ్రమతో కూడినకళ, - మన భక్తిరస ప్రధానములయిన కళా రూపాలలో భజనలు ఒకటి. హరిభజనలు, పండరి భజనలు - ఇలా మరెన్నో ఉన్నాయి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in