|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
గణతంత్ర దినోత్సవం
భారతదేశ చరిత్రలో జనవరి 26, 1950 అనేది
గుర్తుపెట్టుకోదగ్గ ముఖ్యమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం అయితే ఆగస్టు 15,
1947 లోనే
వచ్చింది కానీ, ఈ రోజున భారత రాజ్యాంగం నిర్మించబడి,
డా. బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా
మనది పూర్తి గణతంత్ర దేశం అయినది. ఈ రోజు నుండి భారతదేశం పూర్తిగా ప్రజా
ప్రభుత్వం అయినది. ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు ఈ 'గణతంత్ర రాజ్యం'
ఏర్పడినది. 'గణతంత్ర రాజ్యం' అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు.
ఈ రిపబ్లిక్ దినోత్సవం చాలా ఆనందంగా దేశమంతటా జరుపుకుంటారు. ముఖ్యంగా మన రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. తరువాత వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యార్ధులకు పతకాలు అందజేస్తారు. ఈ రోజును పురస్కరించుకొని రాజధానిలో గొప్ప గొప్ప పెరడ్‌లు జరుగుతుంటాయి. ఎన్నో పాఠశాలల నుండి N.C.C. విద్యార్థులు కూడా ఈ పెరెడ్‌లో పాల్గొంటూ ఉంటారు.
దేశరాజధానిలోనే కాదు, రాష్ట్ర రాజధానిలో, ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఈ రోజును పురస్కరించుకొని ఝండా ఎగురవేసి ప్రజలు తమ దేశం మీద ఉన్న గౌరవాన్ని చాటుతారు. ఈ సంధర్భంగా మన దేశానికి తమ జీవితాన్ని అర్పణ చేసిన ఎందరో వీరుల త్యాగ ఫలాన్ని స్మరించుకుందాం.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in