|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
అన్నవరం
ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది.
రాజమండ్రికి దాదాపు 80 కి. మీ., అన్నవరం స్టేషను నుండి 3
కి.మీ. దూరంలో పంపానదీ తీరంలో
ఉన్న
కొండ రత్నగిరి,
ఇక్కడ రత్నగిరిపై వెలిసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం "అన్నవరం సత్యనారాణ
దేవాలయం" గా ప్రసిద్ధిచెందింది. సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఇక్కడ ఆచరింపబడతాయి. కొండ క్రింది
నుండి పైకి నేరుగా దేవస్థానం
తరపున బస్సులున్నాయి. ఓపిక
ఉంటే మెట్లెక్కి కూడా వెళ్ళ వచ్చును. క్రింది నుండి పైకి
చేరటానికి నడిచి మెట్లెక్కి వెళితే సుమారు 20
నిమిషాలు పట్టవచ్చు.
అంధ్రదేశం హైందవులు
కుల విచక్షణ లేకుండా తమ
ఇంట ఏ శుభకార్యము జరిగినా - వివాహం,
గృహనిర్మాణం జరిగిన,
గృహప్రవేశ మహొత్సవము లేక మరేదైన శుభ సందర్భాలన్నింటికీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
ఒక ముఖ్య భాగంగా ఆచరించుతారు. అది ఈ స్వామి వ్రతమే, అంటే తెలుగువారికి ఎంత
ప్రియాతిప్రియమైన దేవుడో అర్థం చేసుకోవచ్చు. కొండ క్రింది దేవస్థానం సత్రములు,
హొటళ్ళు ఉన్నాయి. కొండపైన కూడా విడిదికి సత్రాలు దేవస్థానం తరపున గదులతో
కూడినవి
ఉన్నాయి.
దేవస్థానం అమరియున్న గుట్ట పేరు రత్నగిరి. పంపానదీ తీరాన
ఉన్న
రత్నగిరికి
విశేష ప్రభావం ఉందని తెలుస్తుంది. పురణకధల్లో-
మేరువు ఇద్దరు కుమారులు భద్రుడు,
రత్నకరుడుగా పేర్కునబడింది. భద్రుడు పెద్దవాడు. రత్నాకరుడు
చిన్నవాడు. ఇద్దరు కూడా తమ పేరు చిరస్థాయిగా ఉండాలని తపస్సు చేయ సంకల్పించినవారు.
భద్రుడే - భద్రగిరి, భద్రాచలంగాను, రత్నాకరుడు - రత్నగిరిగాను శాశ్వతత్వాన్ని
సాధించారు. రెండు కొండల మీద విష్ణు
స్వరూపాలే ప్రతిష్ఠత మవటం గమనార్హం. ఇక్కడి స్వామి త్రిపాద్విభూతి మహానారాయణుడు. నారాయణస్త్రంలో అలంకరించబిడిన వాడై, హిరణ్య గర్భాత్మకుడై తనదేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారి
సమేతుడై శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వెలసి భక్తులకనుగ్రహం ప్రసాదిస్తున్నాడు-
భక్త జన శరణ్యుడిగా సాక్షాత్కరిస్తున్నాడు.
ఆలయం కూడా రెండతస్తులుగా
ఉంటుంది. ఆగమశాస్త్ర విధిగా క్రింది భాగంలో యంత్ర ప్రతిష్ఠ
జరిగింది. స్వామివారి దివ్య మంగళమూర్తిని రెండవ అంతస్థులో దర్శించగలము.
కళ్యాణోత్సవాలు
శ్రీ వారి దివ్య కళ్యాణోత్సవాలు వైశాఖ శుద్ధ దశమీ విశేషోత్సవాలకు తోడు, ఉగాది, శ్రీరామనవమి, వినాయక చాతుర్థి - గణపతి నవరాత్రోత్సవాలు, శరన్నవరాత్రులు, సంక్రాంతి, శుద్ధ ఏకాదశి, భీష్మైకాదశి వగయిరా పర్వదినోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రతి నిత్యమూ జరిగే అర్చనలు, పూజలు, భక్తుల సామూహిక వ్రాతాలు నిత్య కళ్యాణం పచ్చతోరణ వైభవాలు మనకు అన్నవరంలో కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో గల సంపన్న ఆలయాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చును. నిరంతరం భక్తులు యాత్రికులు వస్తూ సందడిగా వుంటుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in