telugudanam.co.in

      telugudanam.co.in

   

ధైర్యలక్ష్మి నోము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక బ్రాహ్మణస్త్రీకి అయిదుగురు తమ్ములుండిరి. ఆ తమ్ముల పెండ్లినాటికి ఆమె భర్తకు ప్రాణముమీదికి వచ్చెడిది. అందుచే నామె పెండ్లికి వెళ్ళెడిది కాదు. ఆ విధముగా నలుగురు పెండ్లిండ్లు అయినవి అయిదవ తమ్ముని పెండ్లి కూడా జరుగుచున్నది. అప్పుడుకూడా యెప్పటి వలెనే ఆమె భర్తకు ప్రాణముమీదికి వచ్చెను. ఈసారి ఆమె తన ధైర్య లక్ష్మియే తనను కాపాడగలదని యెంచుకొని, రోగి అగు మగని యింటిలో పెట్టి తమ్ముని పెండ్లికి ప్రయాణమై పోవుచుండగా దారిలో నొక జువ్విచెట్టు కనబడెను. ఆమె ఆ చెట్టుకు ముమ్మారు ప్రదక్షిణలుచేసి, "తల్లీ! నీవేనాపాలిటి ధైర్యలక్ష్మివి. నేను పుట్టింటనుండి తిరిగివచ్చుసరికి నా భర్తకు ఆరోగ్యమునున్నచో నీకు యేడాదిపొడుగున పూజ చేసెదను" అని నమస్కరించి వెళ్ళిపోయెను. పెండ్లయిన వెంటనే ఆమె యింటికి తిరిగివచ్చుసరికి భర్త ఆరోగ్యముగా నుండెను. ఈ కథ చదువుకొని అక్షింతలు వేసుకొనవలెను.


మూలం: స్త్రీలవ్రత కథలు, మారిశెట్టి నాగేశ్వరరావు, శ్రీ సీతారామా బుక్ డిపో.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: