|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
చిట్కాలు
ఇంటికి సంబంధించినవి
అరటిపండు తొక్కలని ఓవెన్ లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీల్లోని మట్టితో కలిపితే, కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి.
ఆకుకూరల కాడలు, కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని మొక్కల మొదళ్ళలో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడతాయి.
ఇంట్లో కుర్చీల వంటి ఫర్నిచర్‌కు రంగు వేసేటపుడు నాలుగు కోళ్ళకింద సీసామూతలు ఉంచితే రంగు కారినా గచ్చుకు అంటుకోవు.
ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంటే, ఉల్లిపాయలు తరగడానికి ముందు కడిగిన నీటిని వాడండి.
ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపితే దోమలు, ఈగలు రావు.
ఇల్లు తుడిచే స్పాంజి (ఫ్లోర్ మాప్స్) లను నీళ్ళలో విదిలించి ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి పెడితే ఎండిపోయి త్వరగా పాడవకుండా ఉంటాయి.
ఇల్లు రెండు వారాల పాటు తాళం పెట్టి ఉంటే తలుపులు తెరవగానే ఒకలాంటి వాసన వస్తుంది. అలా రాకుండా ఎండాలంటే తలుపులు తెరచి ఒక పెద్ద ప్లేటులో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచండి.
ఈగలను పారద్రోలడంలో మిరియాలు మంచి కీటకనాశినిగా పనిచేస్తుంది.
ఎలక కొరికి ఉపయోగపడని కొత్త బెడ్ షీట్లను బాగున్నంత మేర తీసి గలీబులు, సంచులు కుట్టుకోవచ్చు.
ఎలుకలు విసిగిస్తుంటే వాటి కలుగుల వద్ద పుదీనా రసంలో ముంచిన దూది ఉండను పెట్టండి.
కిటికీల గుండా తలుపు సందుల గుండా చీమలు బారులు తీరి వేంచేస్తున్నాయా? చిన్న దాల్చినచెక్క ముక్కను ఆ దారిలో ఉంచితే చాలు చీమలు ఆ దారిలోంచి పరుగోపరుగు.
కోడిగ్రుడ్డు డొల్లను మెత్తగా పొడిచేసి పాదులకు గానీ, మొక్కలకు గాని వేస్తే మంచి ఎరువులా పని చేస్తుంది.
కత్తెరలు గానీ, చాకులు గానీ, పదును పెట్టించుకోవాలన్నప్పుడు, ఒక గరుకు(ఉప్పు)కాగితంతో గట్టిగా రుద్దితే పదునెక్కుతుంది. ఇది ఇంట్లో మనమే చేసుకోవచ్చు.
కొద్దిగా సబ్బునీటిలో పాత వార్తాపత్రిక ముక్కలు వేయాలి. ఈ నీటిని ఫ్లాస్క్ లో పోసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత బాగా కదిపి ఆ నీటిని పారబోసి మంచి నీటితో శుభ్రపరచాలి. ఫ్లాస్క్ పరిశుభ్రంగా ఉంటుంది.
కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్ధన చేసుకొని గంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రుపోతుంది.
కొబ్బరినూనె గడ్డకట్టకుండా ఉండాలంటే అందులో కొన్ని చుక్కలు ఆవనూనె కలపాలి.
కర్పూరం డబ్బాలో వేసి ఎంత మూతపెట్టినా, కొంత కాలానికి కొంతైనా హరిస్తుంది. నాలుగు మిరియపు గింజలు, నాలుగు బియ్యం గింజలు ఆ డబ్బాలో కర్పూరంతో పాటు వేసి ఉంచితే, కర్పూరం అంత తొందరగా హరించుకుపోదు.
కర్ర సామానుల మీద, నేలపై మంచు కురిసినట్లు చెమ్మపడుతూ ఉంటుంది. లీటరు నీటిలో చెంచాడు కడిగే సోడా కలిపి కడగండి. తరువాత శుభ్రమైన నీటితో మరోసారి కడిగి ఆ నేలని ఆరబెడితే మంచిది.
కొవ్వొత్తి పత్తికి కాస్త ఉప్పురాస్తే ఎక్కువసేపు కాలుతుంది.
కొవ్వొత్తుల వత్తుల అంచుల్ని సగం వరకు కత్తిరిస్తే ఎక్కువసేపు స్థిరంగా, కాంతిగా వెలుగుతాయి.
క్షార పదార్థాలవల్ల అగ్ని ప్రమాదాలు జరిగితే వెన్న నిమ్మరసం, పాలు వంటివి గాయాలకు పూయాలి.
ఖరీదైన గాజుసామాగ్రి శుభ్రం చేస్తున్నప్పుడు చేతిలో నుంచి జారి పగిలిపోకుండా ఉండకుండా వాటిని తుండుగుడ్డలో చుట్టి శుభ్రం చేయాలి.
గంధపు చెక్కను పుస్తకాల మధ్య ఉంచితే పుస్తకాలు తినేసే పురుగులు, చిమటలు ఆదరికిరావు.
గచ్చు నేల కడిగేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే, ఆరిన తరువాత ఈగలు వాలవు.
గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్‌పేస్ట్ తో రుద్దితే సరి.
గులాబీ పువ్వుల రేకులు ఊడి పోకుండా ఉండాలంటే పూలు తేగానే ప్రతీ పువ్వు మధ్యన ఒక చుక్క కొబ్బరి నూనె వేయాలి.
చింతపండుతో పాటు కొంచెం ఉప్పు కూడా కలిపి రాగి పాత్రలను తోమినట్లైతే తళ తళా మెరుస్తాయి.
చేతికి రానంత చిన్నవై పోయిన టాయిలెట్ సోపు ముక్కలు ఎండ బెట్టి తురిమి సర్ఫ్ వంటి పౌడర్లలో కలిపి బట్టలు ఉతికితే కమ్మని సువాసనను అందిస్తాయి.
చెప్పులు, బూట్లు కరుస్తూ ఉంటే ఆ భాగానికి పెరుగుపూసి ఒక రాత్రంతా ఉంచండి. తెల్లవారి ఎండిన పెరుగు దులిపి పాదరక్షలు ధరించండి.
జార్ లేదా బాటిల్ మూత తీయడం కష్టంగా ఉందా? వేడి నీటి పంపు క్రింద కొంచెం సేపు ఉంచండి చాలు.
జలుబు నుంచి ఉపశమనం వదలాలంటే గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రిళ్ళు తాగాలి.
నల్లుల మందులు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి విషం కనుక గదిలో నల్లుల మందు కొడితే, కొట్టిన నాలుగు గంటల తరువాతనే పిల్లల్ని ఆ గదిలోనికి పోనివ్వాలి.
టర్పెన్ టైన్ ఆయిల్ లో తడిపిన పత్తిని ఇంటి మూలల్లో, బీరువాల కిందా ఉంచితే ఎలుకలు రావు.
డర్టీగా, మాసిపోయిన ఎలక్ట్రిక్ స్విచ్చులను కిరోసిన్‌లో ముంచిన కాటన్ తో తుడవండి.
తుప్పుపట్టిన తాళాన్ని కిరోసిన్‌లో ముంచిన బట్టతో తుడిస్తే కొత్తదానిలా తయారవుతుంది.
తుప్పుపట్టిన స్క్రూలకు కాస్త వెనిగర్ రాయండి. కొద్దిసేపటితర్వాత సులువుగా ఊడదీయవచ్చు.
తులసి మొక్కను పురుగు తినకుండా ఉండాలంటే మొక్కల అడుగున ఒక ఉల్లి గడ్డను పాతి ఉంచాలి.
దంత సామాగ్రి బొమ్మల వంటివి పసుపు రంగులోకి మారితే నిమ్మ తొక్కలతో రుద్దాలి.
నిమ్మనూనెలో రెండుచుక్కలు వేపనూనె వేసి రాత్రిపూట దీపం వెలిగిస్తే చక్కటి సువాసన ఇల్లంతా పరచుకోవడమే కాక దోమలూ రావు.
నిలువ చేసిన బియ్యంలో పురుగులు చేరకుండా ఉండాలంటే ఎండిన కాకరకాయను పలచని వస్త్రంలో కట్టి ఆ డబ్బాలో వేస్తే సరి.
పాత గిఫ్ట్ పేపర్లను నోట్‌బుక్‌లకు అట్టలు వేసేందుకు వాడుకోవచ్చు.
పాత గ్రీటింగ్ కార్డుల్లో ఖాళీగా ఉన్న భాగాన్ని పిల్లలకు బొమ్మలు వేసుకునేందుకు ఇవ్వవచ్చు.
పాత చెప్పులను కానీ, కొత్తవి కానీ, ఎప్పుడూ బట్టతో తుడవకూడదు.తుడవడం వలన షైనింగ్, పైన పొట్టు పోతుంది. స్పాంజీ ముక్కతోనే తుడవాలి. మంచి షైనింగ్ వస్తుంది. పైన పొట్టులా లేచిపోదు.
పాత టర్కిష్ టవల్స్ వంటింట్లో చేయి తుడుచు కోవటానికి, చిన్న హ్యాండ్ టవల్స్‌గా కట్‌చేసి ఉపయోగించవచ్చు. చేనేత టవల్స్ అయితే గాజు సాసర్ల సైజులో రౌండ్‌గా కత్తిరించి సాసర్ల మధ్య వుంచితే గీతలు, దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంటాయి.
పాత టాల్కం పౌడర్‌కు సువాసన తగ్గితే ఆ డబ్బాని కాసేపు ఎండలో ఉంచితే సువాసన తిరిగి పొందవచ్చు.
పాత పేపర్లలో మిగిలిన పెద్దపెద్ద ముక్కలను షెల్ఫ్‌లలో పరిస్తే ఆకర్షణీయంగా ఉంటాయి.
పాత బనియన్లు పారేయకుండా కడిగిన గాజు వస్తువులు తుడవడానికి ఉపయోగించవచ్చు. ఇవి తేమను బాగా పీల్చుకుంటాయి. అలాగే రేడియో, టివి వంటి సున్నితమైన పరికరాలు తుడవడానికి ఉపయోగపడతాయి.
పనిచేసే కాలం దాటిపోయిన టానిక్లను మొక్కలకు ఎరువుగా వాడవచ్చు.
పెన్సిల్ బ్యాటరీలు అయిపోవచ్చినట్లు అనిపిస్తే వాటి నెగిటివ్‌వైపు కొవ్వొత్తి మంటమీద అయిదు నిముషాలు ఉంచితే మరికొన్ని రోజులు పనిచేస్తాయి.
ప్లవర్ వాజ్ లో సాల్ట్ కల్పిన నీరు పోస్తే ప్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
ప్లాస్టిక్ కంటైనర్‌కి పసుపు మరకలు అయితే సున్నిపిండి లేదా శనగ పిండితో రుద్దితే అవి మాయమవుతాయి.
పసి పిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీటిలో ఉప్పు, డెటాల్ కలిపితే చర్మ వ్యాధి నిరోధకంగా ఉపయోగపడుతుంది.
పురుగు(చీడ)పట్టిన మొక్కలకు, పాదులకు ఇంగువ నీళ్ళు పోస్తే పురుగులు(చీడ)పోయి చక్కని కాపు కాస్తాయి.
పువ్వులు వాడిపోయినట్లుగా ఉంటే వాటిని ఒక పాత న్యూస్ పేపరులో చుట్టి రాత్రంతా నీళ్ళ బకెట్లో వేస్తే తెల్లవారేసరికి తాజాగా ఉంటాయి.
ఫోటోలను పోస్టులో పంపించదల్చుకున్నప్పుడు వాటి మధ్య కొంచెం టాల్కం పౌడర్ చల్లితే అవి అతుక్కోకుండా ఉంటాయి.
ఫ్లవర్ వాజ్ లో పూలు తాజాగా ఉండడానికి వాజ్ లో నీరు పోయడంతో పాటు పూల రెక్కలపైన, ఆకులపైన కూడా నీళ్లు చిలకరించాలి.
ఫ్లవర్ వాజ్ లో పువ్వులు అమర్చేటప్పుడు ఒక్కోసారి వాటి కాడలు వంగిపోయి ఉంటాయి. అలాంటప్పుడు కాడల్ని సన్నగా చేసి స్ట్రాలో అమర్చి వాజ్ లో పెట్టుకుంటే సరి! రంగురంగుల స్ట్రాలైతే వాజ్ అందం మరింత ఇనుమడిస్తుంది.
బేకింగ్ సోడాను కొద్దిగా ప్లేటులో వేసి బాత్ రూం లో పెడితే వాసన రాకుండా ఉంటుంది.
బోరింగ్ నీటి వల్ల గాజు సామాగ్రి, టైల్స్ పై ఏర్పడే తెల్లని తెట్టులాంటి మరకలు పోవాలంటే దానిపై కొంచెం నిమ్మనూనె రాసి పొడి వస్త్రంతో తుడవాలి.
బెలూన్లను కొన్ని నిముషాల పాటు వేడినీళ్ళలో ఉంచితే గాలి నింపడం తేలికవుతుంది.
మీ చిన్నారులు తమ అలమరలు, పుస్తకాలు, బొమ్మలు, బూట్లు వగైరాలు శుభ్రం చేసేందుకు వీటిని ఇవ్వవచ్చు.
మీ బెడ్ రూంలో ఉన్న ఏదో ఒక బల్బ్ మీద పెర్ ఫ్యూం స్ప్రే చేయండి. ఆ లైట్ వేసినప్పుడు. మీబెడ్ రూం అంతా సువాసనతో నిండిపోతుంది.
మంచి మంచి సీనరీలు, పెయింటింగ్స్ ఉన్న క్యాలెండర్లు సంవత్సరాంతరంలో పడేయకుండా గ్రీటింగుల్లా కత్తిరించుకుంటే వాటిని ఫ్రేం కట్టించుకొని గోడకు అలంకరించుకోవచ్చు.
మనం ఎన్ని సార్లు తోలినా బల్లులు ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. అలా రాకుండా చేయాలంటే ఒక చిట్కా ఉంది. ప్రయోగించి చూడండి. బల్లులు ఎటునుంచి లోపలికి వస్తుంటాయో ఆదార్లో కోడి గుడ్డు డొల్లను (షేల్) ఒకటో, రెండో పెట్టి చూడండి. బల్లులు రావు.
మనం రంగు వెలసిన గలీబులు అలుకు గుడ్డలుగా వాడేబదులు దిండ్లకు ఎక్కించి పైన మంచి గలీబులు తొడిగితే, నూనె మరకలు దిండు వరకూ ఇంకకుండా శుభ్రంగా ఉంటాయి.
మార్బుల్ ఫ్లోరింగ్ రంగు మారకుండా తెల్లగా మెరుస్తూ ఉండాలంటే ఒక బకెట్ నీళ్ళలో సగం ప్యాకెట్ షాంపూ వేసి మార్బుల్ బండలు తుడిస్తే తెల్లగా ఉంటాయి. షాంపూల్లో గాఢమైన యాసిడ్స్ ఉండవు కాబట్టి బండలు దెబ్బతినవు. టాయ్‌లెట్స్ కూడా మార్బుల్స్ వేసినప్పుడు యాసిడ్స్ వంటివి వాడకుండా ఉంటే మంచిది.
యాపిల్సు కొనేటప్పుడు నలుపలకలుగా వున్నవి ఎన్నుకోవాలి.
యిస్త్రీ పెట్టె మరకలను తినే సోడాలో ముంచిన గుడ్డతో తుడిస్తే మరకలు పోతాయి.
రూం ఫ్రెషర్ తో అద్దాలు కూడ క్లీన్ చేయవచ్చు కూడా.
లెదర్ తో తయారైన బ్యాగులు, ఇతర వస్తువులు నీటిలో తడిస్తే వెంటనే గదిలో ధారాళంగా గాలివచ్చే చోట ఉంచి నీడపట్టునే ఆరనివ్వాలి. అంతేకానీ వాటిని ఎండలో పెడితే సహజకాంతిని కోల్పోతాయి. మృదుత్వాన్ని కోల్పోయి పెళుసుగా అనిపిస్తాయి.
లెదర్ పర్సుకు కొద్దిగా ఆలివ్ నూనె రాయాలి. అర గంట తర్వాత మృదువైన వస్త్రంతో తుడిస్తే కొత్త దానిలా మెరుస్తుంది.
లిప్ స్టిక్ విరిగిపోతే రెండు ముక్కల కొనలని నిప్పుమీద కొన్ని సెకన్లు వేడిచేసి దగ్గరికి నొక్కి, ఫిజ్ లో పెడితే గట్టిపడుతుంది.
వంటి సబ్బు ముక్కలతో చేతి రుమాళ్ళను ఉతికితే సబ్బు ఆదా అవుతుంది. చేతి రుమాళ్ళు మంచి సువాసన కూడా వస్తాయి.
వంటింటి సింకులో నుంచి వాసన వస్తోంటే రెండు కప్పుల బ్లీచింగ్ పౌడర్ నీటిలో కలిపి రాత్రి పూట సింకులో పోసి వదిలేయాలి.పొద్దున్నే బాగా నీరు పోస్తే శుభ్రమవుతుంది.
వాడేసిన ఇయర్ బడ్స్ దూదిని తీసి ఆ స్థానంలో కాటన్ ఊలు చుడితే ఆడియో టేప్ లాంటివి శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడతాయి.
వాడేసిన టీపొడిని కాల్చితే వచ్చే పొగ దోమలను తరిమి కొడుతుంది.
వెనిగర్ కలిపిన నీటితో వంట గదిలో గట్టును తుడిస్తే చీమలు రావు.
వార్డ్ రోబ్ లో ఒక మూల ఎండుమిరపకాయలు పెడితే తోకపురుగులు రాకుండా ఉంటాయి.
వాష్ బేసిన్ రంధ్రాలు మూసుకుపోతే ఉప్పు కలిపిన వేడినీళ్ల ని పోస్తే శుభ్రపడతాయి.
షూ పాలిష్ గడ్డకడితే అందులో నాలుగు ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి కలిపితే మామూలుగా తయారవుతుంది.
సంవత్సరం పూర్తయిన తరువాత క్యాలెండర్ పడేయకుండా వాటిని సైజుల వారీగా కత్తిరించుకొని నోట్‌బుక్స్ కుట్టుకుంటే రఫ్వర్క్స్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి.
స్వెటర్లు భద్రపరిచే ముందు వాటి మధ్యలో ఓ వేపపుల్ల పెట్టండి. పురుగులు చేరవు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in