www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు (కొన్ని)

కోవా కేసర్ ఖైన్

కావలసిన వస్తువులు:

పాలు

-

5 లీటర్లు.

చక్కెర

-

600 గ్రా.

కేసరి (కుంకుమపువ్వు)

-

3 గ్రా.

బాదంపప్పు

-

100 గ్రా.

తయారు చేసే విధానం :

పాలు బాగా చిక్కబడేంతవరకు సన్నని సెగపై మరిగించి, ఆపై ట్రేలో పోయాలి. ఫ్యాను గాలికింద ఆరబెట్టి కోవ సిద్ధంచేసుకోవాలి. కోవా గట్టిపడ్డ తర్వాత కొద్దిగా తీసుకుని దానిలో కుంకుమపువ్వు వేసి కొంచెం వేడిపాలు పోయాలి. పది నిముషాలసేపు నాననివ్వాలి. మిగిలిన కోవాలో కొంత భాగాన్ని తీసుకుని రోల్సుగా చేసి, కుంకుమపువ్వు వేసిన కోవాను రోల్స్ మధ్య పెట్టి మళ్ళీ గుండ్రంగా చుట్టాలి. ఆ రోల్స్‌ని కావలసిన సైజులో కట్‌చేసి వాటిపై బాదంపప్పు అద్దాలి.

డ్రైఫ్రూట్స్ హల్వా

కావలసిన వస్తువులు:

బాదం

-

250 గ్రా.

పిస్తా

-

250 గ్రా.

ఖాజు

-

250 గ్రా.

అంజూర్

-

250 గ్రా.

హల్వా పౌడర్

-

250 గ్రా.

నెయ్యి

-

200 గ్రా.

చక్కెర

-

200 గ్రా.

ఖర్జూర

-

400 గ్రా.

తయారు చేసే విధానం :

డ్రైఫ్రూట్స్ అన్నింటిని నెయ్యిలో దోరగా వేయించాలి ఆరబెట్టాలి. హల్వా పౌడర్‌ను లీటర్ నీటిలో కలిపి, సన్నని సెగపై నీళ్ళు గట్టిపడేంత వరకు కలుపుతూ మరగపెట్టాలి. గట్టిపడేముందు చక్కెర, డ్రైఫ్రూట్స్ వేసి కలిపి మిశ్రమాన్ని ట్రేలో వేసుకోవాలి. చల్లారిన తర్వాత కావల్సిన సైజులో కట్‌చేయాలి.

కొబ్బరి లౌజు

కావలసిన వస్తువులు:

కొబ్బరి

-

2 కప్పులు.

పాలు

-

1కప్పు.

పంచదార

-

2 కప్పులు.

నెయ్యి

-

అరకప్పు.

యాలకులు

-

3 గ్రా.

తయారు చేసే విధానం :

పాలు, పంచదార, నెయ్యి, కొబ్బరి తురుము అన్నీ కలిపి గిన్నెలో వేసి సన్నని సెగపై పెట్టి గరిటతో తిప్పుతూ పాకం పట్టాలి. చివరన యాలకుల పొడి వేసి కలిపి ఆపై ట్రేలో పోసి చల్లారిన తర్వాత కావల్సిన సైజులో కట్ చేసుకోవాలి.

ఇడ్లీ ఉప్మా

కావలసిన వస్తువులు:

సాద ఇడ్లీలు

-

10.

తాజా కొబ్బరి

-

అర కప్పు.

మినపప్పు

-

2 టీ స్పూన్లు.

ఎండుమిర్చి

-

 4.

కరివేపాకు

-

2 రెమ్మలు.

పసుపు

-

పావు టీ స్పూను.

జీడిపప్పు

-

పది.

ఉప్పు

-

తగినంత.

ఆవాలు

-

అర టీ స్పూను.

నూనె

-

4 టీ స్పూన్లు.

తయారు చేసే విధానం :

ఇడ్లీల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఆవాలు వేసి చిటపటమన్నాక మినపప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరవాత కరివేపాకు, జీడిపప్పు, పసుపు, ఉప్పు వేసి, ఇడ్లీ ముక్కలు కూడా వేసి కలపాలి. చివరగా కొబ్బరి తురుము చల్లి టమోటా సాస్‌తో వడ్డించాలి.

మసాలా ఇడ్లీ

కావలసిన వస్తువులు:

బాయిల్డ్ బియ్యం

-

4 కప్పులు.

మినప్పప్పు

-

1 కప్పు.

బఠాణీలు

-

50 గ్రా.

కాలిఫ్లవర్

-

50 గ్రా.

బంగాళాదుంపలు

-

2.

టమోటా

-

ఒకటి.

క్యారెట్

-

ఒకటి.

ఉల్లిపాయలు

-

పావు కిలో.

జీడిపప్పు ముక్కలు

-

2 టేబుల్‌ స్పూన్లు.

ఎండుమిర్చి

-

6.

వేయించిన శనగపప్పు

-

2 టీ స్పూన్లు.

కొబ్బరి తురుము

-

1 టీ స్పూను.

మినప్పప్పు

-

1 టీ స్పూను.

ఆవాలు

-

1 టీ స్పూను.

కరివేపాకు

-

10 రెమ్మలు.

నెయ్యి

-

50 గ్రా.

తయారు చేసే విధానం :

బియ్యం, మినప్పప్పు విడివిడిగా రుబ్బుకోవాలి. తరవాత రెండింటినీ కలిపి ఉప్పు వేసి ఓ రాత్రంతా పులియబెట్టాలి. బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, క్యారెట్‌లను చిన్న చిన్న ముక్కలుగా కోసి కాస్తంత పలుకు ఉండేటట్లే ఉడికించాలి. ఉల్లిపాయలు, జీడిపప్పుని చిన్న ముక్కలుగా కోయాలి. కొబ్బరి తురుము, వేయించిన శనగపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కలిపి మెత్తగా నూరాలి.

ఓ బాణలిలో 3 టీ స్పూన్ల నెయ్యి వేసి వేడిచేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి చిటపటమన్నాక టమోటా, ఉల్లి, జీడిపప్పు, ఇతర కూరగాయముక్కలు వేసి ఓ ఐదు నిమిషాలు వేయించాలి. ఇందులోనే కొబ్బరి పచ్చిమిర్చి ముద్దను కూడా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటినీ ఇడ్లీపిండిలో కలిపి కొద్దికొద్దిగా రేకుల్లో వేసి ఉడికిస్తే మసాలా ఇడ్లీ రెడీ!

ఉప్పిడి పిండి

కావలసిన వస్తువులు:

బియ్యం పిండి

-

500 గ్రా.

పుల్లటి మజ్జిగ

-

200 గ్రా.

ఉప్పు

-

సరిపడినంత.

పోపు దినుసులు

-

సరిపడినన్ని.

కరివేపాకు

-

2 రెమ్మలు.

మంచి నూనె

-

సరిపడినంత.

నీళ్ళు

-

సరిపడినన్ని.

తయారు చేసే విధానం :

ముందుగా బియ్యంపిండి, పుల్లటి మజ్జిగ, ఉప్పు, పచ్చిమిర్చి సరిపడినన్ని నీళ్ళతో మిశ్రమాన్ని చక్కగా పావుగంట నానబెట్టాలి. గిన్నెలో నూనె వేడిచేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాక నానబెట్టిన బియ్యంపిండి వేసి సన్నని సెగపై ఉడికిస్తూ మిశ్రమం పొడిపొడిగా అయ్యేలా కలుపుతూ వుండాలి. దీన్ని మరొక రకంగా కూడ తయారు చేసుకోవచ్చు. గిన్నెలో నూనె వేడిచేసి పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించాక సరిపడినన్ని నీళ్ళు పోసి సన్నని సెగపై మరిగించాలి. ఎసరు వచ్చాక నానబెట్టి వుంచుకున్న బియ్యం పిండి మిశ్రమం వేసి ఉడికించాలి. ఉప్పుడు పిండిని మామిడి లేదా ఉసిరి పచ్చడితో కలిపి అతిధులకు అందించండి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in