telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

టమోటా పప్పు

కావలసిన వస్తువులు:

టమోటాటమోటా మిర్చి
టమోటాలు - పావు కిలో.
కందిపప్పు - 250 గ్రా.
నూనె - 25 గ్రా.
పచ్చిమిర్చి - 4.
కరివేపాకు - 2 రెబ్బలు.
వెల్లుల్లి - 1 రేక.
చింతపండు - సరిపడినంత.
ఉప్పు - సరిపడినంత.
కారం - అర టీ స్పూన్.
పసుపు - 1 చిటికెడు.
పోపులు - సరిపడినంత.
ఉల్లిపాయలు - 2.
ఇంగువ - చిటికెడు.
కొత్తిమీర - కొంచెం.
ఎండుమిర్చి - 1.

తయారు చేసే విధానం:

కందిపప్పు బాగా కడిగి ఉడక బెట్టాలి, సగానికి పైగా ఉడికిన తరువాత, టమోటా ముక్కలు, ఉల్లిపాయలు కోసి వెయ్యాలి, ఉప్పు, పసుపు, కారం, చింతపండు పులుసు పోసి ఉల్లిపాయ ఉడికేంతవరకు ఉంచి, అనంతరం బాండిలో నూనె కాచి పోపుగింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బ,ఇంగువ, కొత్తిమీర వేసి వేయించి పప్పులో వేసి బాగా కలిపి దించుకోవాలి.


[ వెనుకకు ]


తోటకూర పప్పు

కావలసిన వస్తువులు:

తోటకూర - 1 కట్ట
కందిపప్పు - 250 గ్రా.
నూనె - 25 గ్రా.
పచ్చిమిర్చి - 4.
ఎండుమిర్చి - 1.
పోపు గింజలు - సరిపడినంత.
ఇంగువ - కొంచెం.
ఉప్పు - సరిపడినంత.
చింతపండు - కొంచెం.
కారం - అర టీ స్పూన్.
ఉల్లిపాయలు - 2
కొత్తిమీర - కొంచెం
కరివేపాకు - 2 రెబ్బలు.

తయారు చేసే విధానం:

కందిపప్పు బాగా కడిగి ఉడక బెట్టాలి తోటకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కలుగా తరుక్కోవాలి. చింతపండు రసం తీసుకొని పెట్టుకోవాలి. తరిగిన తోటకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఉడుకుతున్న పప్పులో చింతపండు రసం వెయ్యాలి. తోటకూర ఉడికిందనుకున్నాక ఉప్పు, కారం కలిపి, పోపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేయించి తాలింపు (తిరగమాత) పెట్టుకోవాలి.


[ వెనుకకు ]


బెండకాయ వేపుడు

కావలసిన వస్తువులు:

బెండకాయలు - పావు కిలో.
నూనె - వేయించడానికి సరిపడినంత.
కారం - సరిపడినంత.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

బెండకాయలను అంగుళం సైజు ముక్కలుగా తరగాలి. బాణలిలో నూనె మరిగిన తర్వాత బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసి దోరగా వేయించి ఒక గిన్నెలో వేసుకోవాలి. తరువాత ముక్కలకు సరిపడినంత కారం, ఉప్పు, అరస్పూన్ నూనెలో వేయించి కలుపుకోవాలి.


[ వెనుకకు ]


చేమదుంప వేపుడు

కావలసిన వస్తువులు:

చేమదుంపలు - అర కిలో.
నూనె - వేయించటానికి సరిపడినంత.
ఉప్పు - తగినంత.
కారం - తగినంత.

తయారు చేసే విధానం:

ముందుగా చేమదుంపల్ని ఉడకబెట్టి తొక్కలు వలిచి ముక్కలుగానో, చక్రాలుగానో తరుక్కోవాలి. నూనె మరిగించి ఆ ముక్కల్ని అందులో బాగా బోలుగా వచ్చేంత వరకు వేయించి తీసుకొని దానిలో తగినంత ఉప్పు కారాలు చల్లి కలుపుకోవాలి.


[ వెనుకకు ]


దోసకాయ పప్పు

కావలసిన వస్తువులు:

దోసకాయలు - పావు కిలో.
కందిపప్పు - 250 గ్రా.
నూనె - 25 గ్రా.
చింతపండు - సరిపడినంత.
కరివేపాకు - 2 రెబ్బలు.
కొత్తిమీర - 1/4 కట్ట.
పచ్చిమిర్చి - 6.
ఎండుమిర్చి - 1.
ఇంగువ - చిటికెడు
పోపు గింజలు - తగినన్ని.
ఉప్పు - సరిపడినంత.
కారం - అర టీ స్పూన్.
ఉల్లిపాయలు - 2

తయారు చేసే విధానం:

చింతపండు నానేయాలి. దోసకాయ చెక్కుతీసి ముక్కలు కోసుకోవాలి. కందిపప్పును ఉడికించి దోసకాయ ముక్కల్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో కుమ్మరించాలి. ముక్క ఉడికాక చింతపండు పులుసు నందులో పిండి కొత్తిమీర ఉప్పు వేసి, పప్పు బాగా ముద్దయ్యేదాకా మగ్గనివ్వాలి ఈలోగా మరో స్టవ్‌మీదనో, బర్నర్ మీదనో పోపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి, ఇంగువా, ఎండుమిర్చీ ముక్కల్ని బాగా వేయించి పోపుని పప్పులోకి వంపి కలుపుకుని దింపుకోవాలి.


మూలం : అన్నపూర్ణ వంటలు, పిండి వంటలు పుస్తకములోనివి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: