telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

గారెలు

కావలసిన వస్తువులు:

మినపప్పు - 1 డబ్బా.
అల్లం - చిన్న ముక్క.
పచ్చి మిర్చి - 8.
ఉల్లిపాయలు - 2.
నూనె - వేయించటానికి సరిపడినంత.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

మినపప్పు శుభ్రంగా కడిగి, గట్టిగా, ఎక్కువ నీరు వెయ్యకుండా, మెత్తగా లేక కొంచం పొలుకుగా కావలనుకునే వారు పొలుకుగా పిండి వేయించుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత ఒక కవర్ తీసుకొని దానిమీద గారెల పిండిని ముద్దగా పెట్టి వెడల్పుగా వత్తి నూనెలో వెయ్యాలి. అవి బాగా కాలిన తరువాత తియ్యాలి, అలానే ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం ముక్కలుగా చేసి అందులో కలపుకొని గారెలు వేసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు క్యాబేజి కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి.


[ వెనుకకు ]

వంకాయ పచ్చడి

కావలసిన వస్తువులు:

వంకాయలు - 1 కిలో.
చింతపండు - 1/4 కిలో.
ఉప్పు - 1 డబ్బా.
కారం - 1 గిద్ద.

తయారు చేసే విధానం:

ముందుగా వంకాయలు శుభ్రంగా కడిగి, తుడిచి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. తరువాత చింతపండు, ఉప్పు, కొంచెం వంకాయ ముక్కలు వేసి, కారం కూడా వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. మెదిగిన తరువాత మిగిలిన వంకాయ ముక్కలు వేసి కొంచెం పలుకుగా రుబ్బుకొని తీసుకోవాలి. తరువాత తాలింపు పెట్టుకోవాలి.


[ వెనుకకు ]

నిమ్మకాయ ఊరగాయ

కావలసిన వస్తువులు:

నిమ్మకాయలు - 100.
ఉప్పు - 6 గిద్దలు.
పసుపు - కొంచెం.
కారం - 3 గిద్దలు.

తయారు చేసే విధానం:

ముందుగా నిమ్మకాయలు కడిగి తుడిచి ముక్కలు చేసి, ఉప్పులో ఊరవెయ్యాలి. 10 రోజులు అలా ఊరిన తరువాత ముక్క మెత్తబడినదా లేదా అని చూసి మెత్త బడక పోతే ఇంకా కొన్ని రోజులు ఉంచి ఊరిన తరువాత కారం కలుపుకోవాలి.


[ వెనుకకు ]

దబ్బకాయ ఊరగాయ

కావలసిన వస్తువులు:

దబ్బకాయ - పెద్దది.
ఉప్పు - 1 గిద్ద.
పసుపు - కొంచెం.
కారం - 1 గిద్ద.

తయారు చేసే విధానం:

ముందుగా దబ్బకాయ కడిగి తుడిచి ముక్కలు చేసి, ఉప్పులో ఊరవెయ్యాలి. 10 రోజులు అలా ఊరిన తరువాత ముక్క మెత్తబడినదా లేదా అని చూసి మెత్త బడక పోతే ఇంకా కొన్ని రోజులు ఉంచి ఊరిన తరువాత కారం కలుపుకోవాలి. (చిన్నకాయ అయితే ఉప్పు 3/4 డబ్బా, కారం ఉప్పులో సగం).


[ వెనుకకు ]

దద్దోజనం

కావలసిన వస్తువులు:

బియ్యం - 1 కిలో (కడిగి నానబెట్టాలి).
తాజా గట్టి పెరుగు - 1 లీటరు.
నెయ్యి - 100 గ్రా.
కరివేపాకు - 4 రెమ్మలు.
ఎండు మిర్చి - 10.
చిక్కటి పాలు (కాచినవి) - అర లీటరు.
పచ్చి మిర్చి - 10.
అల్లం (సన్నని ముక్కలు) - 2 టీ స్పూన్లు.
ఆవాలు - 2 టీ స్పూన్లు.
ఇంగువ పొడి - అర టీ స్పూను.
మిరియాలు - నాలుగు టీ స్పూన్లు.
పసుపు - పావు టీ స్పూను.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

బియ్యం కడిగి ఎసట్లో పోసి కాస్త మెత్తగా ఉడికించాలి. అన్నం చల్లారనివ్వాలి. పెరుగులో నీళ్ళు పోయకుండా గిలకొట్టి పసుపు, ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి తురుము వేసి కలపాలి. నేతిలో ఎండుమిర్చి, ఆవాలు, మిరియాలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసి సువాసన వచ్చే వరకు వేపి పెరుగులో కలపాలి. ఇప్పుడు గోరు వెచ్చని పాలు పోసి, అన్నం కూడా వేసి బాగా కలిపి గిన్నెలోకి సర్దాలి. (పెరుగు మాత్రమే వేసినట్లైతే దద్దోజనం త్వరగా పులిసిపోతుంది. కాచిన పాలు కలపడం వల్ల రుచి పెరుగుతుంది.చిక్కగా ఉంటుంది.)


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: