telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

గుత్తి వంకాయకూర

కావలసిన వస్తువులు:

గుత్తి వంకాయలు - 1/2కిలో.
చింతపండు - 100 గ్రా.
ధనియాలు - 100 గ్రా.
ఎండు మిరపకాయలు - 50 గ్రా.
ఉప్పు - తగినంత.
పచ్చిపప్పు - 25 గ్రా. నానపెట్టుకోవాలి.
ఉల్లిపాయలు - 3 (100గ్రాములు) సన్నగా తరగాలి.

తయారు చేసే విధానం:

ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించి పొడిచేసుకొని, చింతపండు రసం తీసుకొని (చిక్కగా) దానిలో పైన తయారు చేసిన పొడి, ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిపప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు తొడిమ ఊడకుండా 4 పక్షాలుగా కోసి దానిలో పైన తయారు చేసిన మసాలాను పెట్టి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసి దానిలో మసాలా కూరిన వంకాయలను వేసి మిగిలిన మసాలా కూడా గిన్నెలో పోసి సన్న సెగమీద ఉడకనివ్వాలి.


[ వెనుకకు ]


బాసుందీ

కావలసిన వస్తువులు:

పాలు - 2 లీటర్లు.
పంచదార - అర కప్పు.
పప్పు - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా ముక్కలుగా కోయాలి).
యాలకుల పొడి - 1 టీ స్పూను.
మిల్క్‌మెయిడ్ - 1 డబ్బా.

తయారు చేసే విధానం:

పాలను చిక్కగా కోవాలా అయ్యేవరకూ మరిగించాలి. అందులో పంచదార, మిల్క్‌మెయిడ్ కలిపి సిమ్‌లో పెట్టి మరో పదిహేను నిమిషాలు మరిగించి దించాలి. బాదం, యాలకులపొడి వేసి కలిపి చల్లారాక ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లచల్లగా ఉన్న బాసుందీని పిల్లలూ, పెద్దలూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు.


[ వెనుకకు ]


మామిడి పలావు

కావలసిన వస్తువులు:

ఎర్ర బియ్యం - 200 గ్రా.
తేనె - మూడు టేబుల్ స్పూన్లు.
కొబ్బరి పాలు - ఒక కప్పు.
బాదం లేదా జీడి పప్పులు - ఒక టేబుల్ స్పూను.
మామిడి పండు - ఒకటి.

తయారు చేసే విధానం:

బియ్యాన్ని రాత్రే నానబెట్టుకుని పొద్దున కుక్కర్‌లో ఉడకబెట్టండి. దించాక తేనె, కొబ్బరి పాలు కలిపి చివర్లో మామిడి ముక్కలు వేయండి.వేగించిన బాదం లేదా జీడి పప్పు పలుకుల్ని, కొన్ని మామిడి ముక్కల్ని పైన అలంకరించి వడ్డించండి.


[ వెనుకకు ]


మామిడి రైతా

కావలసిన వస్తువులు:

గట్టి పెరుగు - రెండు కప్పులు.
ఆవాల పొడి - అర టీ స్పూను.
కారం - పావు టీ స్పూను.
ఉప్పు - తగినంత.
మామిడి ముక్కలు - అర కప్పు.

తయారు చేసే విధానం:

పెరుగు చిలక్కొట్టి (నీళ్ళు కలపకుండా)అన్ని పొడులూ కలిపాక. చివర్లో మామిడి ముక్కలు వేసి పెట్టండి. కావల్సి వస్తే ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా చేసుకుని తినొచ్చు. చేయడానికి 5 నిమిషాల కంటే పట్టదు.


[ వెనుకకు ]


అటుకుల పాయసం

కావలసిన వస్తువులు:

తాజా మీగడపాలు - 1 లీటరు.
అటుకులు - 100 గ్రా.
పంచదార - పావు కిలో.
యాలుకలు - 4 (పొడిచేయాలి).
జీడిపప్పు - 4 టేబుల్ స్పూన్లు.
ఎండుద్రాక్ష - 2 టేబుల్ స్పూన్లు.
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు.

తయారు చేసే విధానం:

ముందుగా అటుకుల్ని కడిగి నీళ్ళు లేకుండా పదినిముషాలు ఆర బెట్టాలి. మందపాటి బాణలిలో పాలు పోసి కాసేపు మరిగించాలి. అందులో అటుకులు వేసి తక్కువ మంటమీద కాసేపు ఉడికించాలి. తరవాత పంచదార, యాలుకల పొడి వేసి పాలు సగమయ్యేవరకు ఉడికించి దించాలి. మరో బాణలీలో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి పాయసంలో కలపాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: