telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

చిలకడ దుంప చిప్స్

కావలసిన వస్తువులు:

చిలకడ దుంపలు - 500 గ్రా.
మిరియాల పొడి - 2 గ్రా.
ఉప్పు - 5 గ్రా.
రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:

దుంపల్ని బాగా కడగండి. చెక్కు తీశాక కట్టర్‌తో లావుపాటి స్లైసెస్‌గా కోయండి. నాలుగేసి స్లైసెస్‌ను ఒకదాని మీద ఒకటి ఉంచి చాకుతో నిలువుగా కోయండి. వీటిని కాగుతున్న నూనెలో వేసి వేయించండి.

ఈ చిప్స్‌లో నూనె జారిపోయాక ఉప్పు, మిరియాల పొడి కలిపి చల్లార్చండి. చిలకడ దుంప చిప్స్ తయార్. వీటినే స్వీట్ పొటాటో చిప్స్‌గా మార్కెట్‌లో అమ్ముతుంటారు.


[ వెనుకకు ]


కాకరకాయ చిప్స్

కావలసిన వస్తువులు:

కాకరకాయలు - 1 కిలో.
కార్న్‌ఫ్లోర్ - 50 గ్రా.
మైదా - 70 గ్రా.
అల్లం, వెల్లుల్లి - ఒకటిన్నర టీ స్పూన్.
ధనియాలపొడి - 1 టీ స్పూన్.
కారం - అర టీ స్పూన్.
జీలకర్ర పొడి - అర టీ స్పూన్.
కొత్తిమీర - 2 కట్టలు.
ఉప్పు - తగినంత.
నిమ్మ ఉప్పు - అర టీ స్పూన్.
రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి సరిపడా.
రెడ్ఆరెంజ్ కలర్ - చిటికెడు.

తయారు చేసే విధానం:

పొడవుగా ఉన్న కాకరకాయల్ని ఎంచుకోండి. శుభ్రం చేశాక చాకుతో పొడవుగా సన్నగా తరగండి. ఈ ముక్కల్ని మరుగుతున్న నీళ్లలో వేయండి. ఈ నీళ్లలో ఉప్పు, నిమ్మ ఉప్పు కలపండి. అయిదు నిమిషాల పాటు కాకరకాయ ముక్కల్ని ఉంచి నీళ్లను వడగట్టండి.

ఓ గిన్నెలో మైదా, కార్న్‌ఫ్లోర్, అల్లంవెల్లుల్లి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, తరిగిన కొత్తిమీర, ఉప్పు కలపండి. ఈ మిశ్రమంలో కాసిన్ని నీళ్లు పోసి జారుడుపిండిలా చేయండి. ఇందులోనే రెడ్ ఆరెంజ్ కలర్ చేర్చండి.

చల్లారిన కాకరకాయ ముక్కల్ని ఈ పిండిలో ముంచి మరుగుతున్న నూనెలో వేసి కరకరలాడేలా వేయించండి. కాకరకాయ చిప్స్ సిద్ధం.


[ వెనుకకు ]


బీరకాయ బజ్జి

కావలసిన వస్తువులు:

బీరకాయలు - రెండు.
శనగపిండి - 1 కప్పు.
బియ్యప్పిండి - అర కప్పు.
నూనె - 2 కప్పులు.
వంటసోడా - చిటికెడు.
కారం - 2 టీ స్పూన్లు.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

ముందుగా బీరకాయలు తొక్కు తీసి చక్రాల్లా కోసుకోవాలి. బియ్యప్పిండి, శనగపిండి, ఉప్పు, కారం, వంటసోడా కలిపి నీళ్లు పోసి జారుగా కలపాలి.

స్టవ్‌మీద కళాయి పెట్టి నూనె పోసి బాగా కాగిన తరవాత ఒక్కో బీరకాయ ముక్కని శనగపిండిలో ముంచి నూనెలో వేయించాలి. ఎర్రగా వేయించి తీశాక టమోటా సాస్‌తో వడ్డించాలి.


[ వెనుకకు ]


కాలీఫ్లవర్ పరోటాలు

కావలసిన వస్తువులు:

గోధుమ పిండి - రెండు కప్పులు.
మంచినీళ్లు - తగినన్ని.
ఉప్పు - తగినంత.
నూనె - తగినంత.

పరోటాలోకి:

కాలీఫ్లవర్ తురుము - రెండు కప్పులు.
పచ్చిమిర్చి - రెండు సన్నగా తురిమినవి.
కొత్తిమీర - ఒక టీస్పూను.
కారం - అర టీ స్పూను.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

గోధుమపిండి జల్లించి ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలపాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, తురిమిన కాలిఫ్లవర్ అన్నీ బాగా కలిపి నీళ్లు పిండేయాలి. ఇందులో కారం వేసి బాగా కలపాలి. పరోటాపిండిని చిన్న చిన్న ముద్దలుగ చేసుకోవాలి. ఒక్కో ముద్దనీ పూరీలా వత్తాలి. దాని మధ్యలో కాలిఫ్లవర్ తురుము మిశ్రమాన్ని ఉంచి పూరీ అంచులు పైకి మడవాలి. దీన్ని మెల్లగా వత్తుతూ చపాతీలాగా చేయాలి. ఈ పరోటాల్ని ఓ స్పూను నూనె వేసి పెనం మీద కాల్చాలి. దీన్ని చట్నీతోగాని పెరుగుతో గాని తినవచ్చు.


[ వెనుకకు ]


పొన్నగంటి కూర

కావలసిన వస్తువులు:

పొన్నగంటి కూర - ఆరు కట్టలు(చిన్నవి).
ఉల్లిపాయలు - రెండు.
పచ్చికొబ్బరి చిప్ప - పావు.
నూనె - తగినంత.
పసుపు - చిటికెడు.

పోపులోకి కావలసినవి: ఎండుమిరపకాయలు, మిపపప్పు, ఆవాలు, జీలకర్ర కరివేపాకు, వెల్లుల్లి.

ఆకు కడిగి సన్నగా తరగాలి. ముందుగా పోపు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తరువాత కొంచెం పసుపు వేసి, తరిగిన ఆకు వేసి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి, సరిపడా ఉప్పు వేసి నీరంతా ఇగిరేవరకూ వేయించాలి. చివరగా దించేముందు కొబ్బరి తురుము వేసి కలపాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: