telugudanam.co.in

      telugudanam.co.in

   

గుమ్మడి ఘుమఘుమలు

గుమ్మడి పప్పు

కావలసిన వస్తువులు:

గుమ్మడి ముక్కలు
-
ఒక కప్పు గుమ్మడికాయ
బంగళాదుంపలు
-
రెండు చిన్న ముక్కలు
ఉల్లిగడ్డ
-
ఒకటి
పచ్చిమిరపకాయలు
-
రెండు
గరంమసాలా
-
ఒక చెంచా
పచ్చికొబ్బరి పొడి
-
ఒక చెంచా
పుదీనా, కొత్తిమీర, కరివేపాకు
-
తగినంత
నూనె, మీగడ
-
ఒక చెంచా
కారం, ఉప్పు
-
రుచికి తగినట్టు
టమాటాలు
-
రెండు

తయారు చేసే విధానం:

ముందుగా కందిపప్పు, దుంపలు ఉడికించాలి. గుమ్మడి ముక్కలు సన్నగా తరగాలి. ఒక గిన్నెలో నూనెపోసి వేడిచేసి తాలింపు చేయాలి. దీంట్లో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. పుదీనా, కరివేపాకు, దుంపలు, గుమ్మడి ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తరువాత గరం మసాలా, ఉప్పు, కారం, టమటా వేసి కొంచెం నీరు పైనుండి చిలకరించి ఒక పదినిముషాల సేపు మూతపెట్టి ఉడకనివ్వాలి. తరువాత దించి డిష్‌లోకి తీసుకుని పై నుండి కొత్తిమీర, మీగడ, కొబ్బరి చల్లాలి.


[ వెనుకకు ]

గుమ్మడి విత్తనాల కర్రీ

కావలసిన వస్తువులు:

గుమ్మడి గింజలు
-
ఒక కప్పు గుమ్మడి పప్పు
కందిపప్పు
-
1/2 కప్పు
పచ్చికొబ్బరి తురుం
-
ఒక కప్పు
గరంమసాల
-
ఒక చెంచా
ఉప్పు, కారం
-
రుచికి తగినంత
పెద్ద ఉల్లి
-
ఒకటి
టమాటాలు
-
రెండు
పచ్చిమిరపకాయలు
-
రెండు
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మీగడ
-
తగినంత

తయారు చేసే విధానం:

ముందుగా గింజలని ఉడికించాలి, పప్పును ఉడికించాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేడిచేసి తాలింపు చేసాక, ఉల్లిపాయ, మిరపకాయలు వేసి వేయించాలి. పుదీనా, కరివేపాకు, గింజలు, పప్పు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. చివరకి టమాటా కూడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి గ్రేవీలా చేయాలి. ఉడికిన తరువాత దించి గరంమసాలా, కొత్తిమీరవేసి, క్రీమ్ కలిపి వడ్డించాలి. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి బాగుంటుంది.


[ వెనుకకు ]

గుమ్మడి చట్నీ

కావలసిన వస్తువులు:

కందిపప్పు
-
ఒక కప్పు గుమ్మడి పప్పు
ఎండుమిర్చి
-
ఐదు
గుమ్మడి తురుము
-
అర కప్పు
ధనియాలు, జీలకర్ర
-
రెండు స్పూన్లు
వెల్లుల్లి
-
ఒక రెబ్బ
చింతపండు
-
రెండు రెబ్బలు
నూనె
-
తగినంత
ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు
-
తగినంత

తయారు చేసే విధానం:

ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేడిచేసి కందిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర గుమ్మడి వేసి వేయించాలి. వీటన్నింటిని మిక్సీలో వేసి రుబ్బాలి. దీంట్లో కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి రుబ్బి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇంగువతో తాళింపు పెట్టుకోవాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: