telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

టమోటా పెరుగు పులుసు

కావలసిన వస్తువులు:

టమోటా
-
పావుకిలో.  
ఉల్లిపాయలు
-
రెండు. టమోట పెరుగుపులుసు
పచ్చిమిర్చి
-
ఆరు.
పెరుగు
-
ఒక కప్పు.
ఉప్పు
-
తగినంత.
పసుపు
-
చిటికెడు.

పోపు సామాగ్రి:

ఎండు మిర్చి
-
రెండు
మినపప్పు
-
అర టీస్పూన్‌.
ఆవాలు
-
పావు టీస్పూన్‌.
వెల్లుల్లి
-
మూడు రేకలు.
కరివేపాకు
-
కొద్దిగా.
నూనె
-
50 గ్రా.

తయారు చేసే విధానం:

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు ముక్కలు తరగాలి. ఇవి చాలా చిన్న ముక్కలుగా ఉండాలి. బాణలిలో నూనె మరిగాక ఆవాలు వేసి చిటపటలాడాక ఎండు మిర్చి ముక్కలు, మిగిలిన పోపు వేయించి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేయించి, టమోటా ముక్కలు, ఉప్పు వేసి బాగా మరిగించి, పెరుగు వేసి కలిబెట్టి దించాలి. కొద్దిగా కొత్తి మీర వేసుకుంటే రుచి అదిరిపోతుంది.


[ వెనుకకు ]

క్యాలీఫ్లవర్‌ రైస్‌

క్యాలీఫ్లవర్‌ రైస్‌

కావలసిన వస్తువులు:

బాస్మతి బియ్యం - మూడు కప్పలు.
క్యాలీఫ్లవర్‌ - ఒకటి.
ఆలుగడ్డలు - మూడు.
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - ఒక స్పూన్‌.
పచ్చిమిర్చి - నాలుగు.
నూనె - పావు కప్పు.
పసుపు - ఒకటేబుల్‌ స్పూన్‌.
ఉల్లిపాయలు - మూడు.
టమోటాలు - మూడు.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:

బియ్యాన్ని నూనెలో కొద్దిగా వేయించి ప్రెజర్‌లో ఉడికించాలి. కాలీఫ్లవర్‌ను ఉడికించాలి. ఆలుగడ్డలను చిన్న ముక్కలు చేసి నూనెలో వేయించాలి. పాన్‌లో నూనె వేసి, తరిగినఉల్లిపాయ ముక్కలను వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్టును, తరిగిన టమోటాలను కూడా వేసివేయించాలి. పసుపు పొడి, కారం, పొడి మసాలా, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసివేయించాలి. చాలినంత ఉప్పువేసి చివరగా ఉడికించిన కాలీఫ్లవర్‌వేసి కలపాలి. ఉడికించిన రైస్‌లో ఈ మిశ్రమాన్ని కలపాలి. చివరగా వేయించిన ఆలుగడ్డ ముక్కలు కలుపుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి చల్లుకుని వడ్డించుకోవాలి.


[ వెనుకకు ]

క్యారెట్‌ హల్వా

కావలసిన వస్తువులు:

క్యారెట్‌ - 500 గ్రా.
పాలు - 600మి.లీ.
పంచదార - 50 గ్రా.
ఏలకులు - 4 (పొడిచేసుకోవాలి).
పిస్తా/బాదం - 10-12.
కిస్మిస్ - సరిపడినంత.
నెయ్యి - 2 స్పూన్లు.
కోవా - 100 గ్రా.

తయారు చేసే విధానం:

క్యారెట్‌ శుభ్రంగా కడిగి తొక్క తీసివేసి బాగా తురుము కోవాలి.ఇప్పుడు పాలు బాగా కాచి అందులో కోవా, తరిగిన క్యారెట్‌ వేసి ఒక 10 నిమిషాలు (పాలు ఆవిరి అయ్యేవరకు)ఉడకనివ్వాలి. తరువాత అందులో పంచదార, ఏలకులపొడి, నెయ్యి, కిస్మిస్ వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు తర్వాత స్టవ్ పై నుంచి దించెయ్యాలి. పిస్తా/బాదం పైన తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసి క్యారెట్‌ హల్వా పై అలంకరించాలి. ఇప్పుడు రుచికరమైన హల్వా రెడీ.


[ వెనుకకు ]

మినప సున్నుండలు

కావలసిన వస్తువులు:

మినప్పప్పు - 500 గ్రా.
పంచదార - 350 గ్రా.
నెయ్యి - 200 గ్రా.
ఏలకులు - 5.
పిస్తా/బాదం(చిన్న ముక్కలు) - సరిపడినంత.

తయారు చేసే విధానం:

మినప్పప్పును మంచి సువాసన వచ్చేవరకు (గ్యాస్ తక్కువలో పెట్టుకొని 15 నిమిషాలు )వేయించి, కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి . విడిగా పంచదారను కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెంటిని బాగా కలిపి ఏలకులు, పిస్తా, బాదం పప్పులను కలిపి అందులో వేడిచేసిన నెయ్యిని కలుపుకొని ఉండలుగా చుట్టుకోవాలి.(నెయ్యి ఇష్టపడేవారు మరికాస్త కలుపుకోవచ్చు)


[ వెనుకకు ]

గోంగూర పచ్చడి

కావలసిన వస్తువులు:

గోంగూర(ముదిరిన ఆకు) - 1 కేజీ.
ఉప్పు - 500 గ్రా.
ఎండుమిర్చి - 250 గ్రా.
చింతపండు - 250 గ్రా.
పోపు - తగినంత.
మెంతులు - 20 గ్రా.
వెల్లుల్లి పాయలు - 250 గ్రా.
పసుపు - 2 స్పూన్లు.
నువ్వుల నూనె - 600 గ్రా.

తయారు చేసే విధానం:

ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. బాగా ఒడలిన తర్వాత కొంచెం నూనె వేసి వేయించాలి. కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి రెండు రోజులు పక్కన పెట్టాలి. మూడవ రోజున చింతపండు బాగా వేడినీళ్ళలోనానబెట్టాలి. అది గుజ్జులాగ తయారవ్వాలి. ఎండుమిరపకాయలు నూనెలో వేయించాలి. తర్వాత వెల్లుల్లిపాయలు దంచుకోవాలి. మెంతుల్ని వేయించి పొడి చేయాలి. అన్ని కలిపి ఆకుతో సహా మిక్సీలోవేయాలి. మిగిలిన నూనెను బాగా కాచి మూడు స్పూన్ల శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, కొద్దిగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి దించేయాలి. చల్లారిన తర్వాత పచ్చడిలో కలపాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: