telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)

వాంగీ బటాతా మసాలా

కావలసిన వస్తువులు:

‌బంగాళాదుంపలు - 500 గ్రాములు.
‌వంకాయలు - 300 గ్రాములు.
‌జీలకర్ర - ‌5 గ్రాములు.
నూనె - 50 గ్రాములు.
దాల్చినచెక్క - ‌2 గ్రాములు.
ఉల్లిపాయలు - 75 గ్రాములు.
‌అల్లం వెల్లుల్లి పేస్టు - 25 గ్రాములు.
‌టొమాటోలు - 25 గ్రాములు.
‌పసుపు - 5 గ్రాములు.
‌మిర్చిపొడి - 10 గ్రాములు.
‌ధనియాలపోడి - 10 గ్రాములు.
‌జీలకర్ర పోడి - 10 గ్రాములు.
‌తరిగిన కొత్తిమీర - 10 గ్రాములు.
‌పచ్చిబఠాణిలు - 25 గ్రాములు.
‌ఉప్పు - రుచికి తగినంత.
‌నిమ్మకాయ - 1.

తయారు చేసే విధానం:

బంగాళాదుంపలను ఉడికించి చెక్కు తీసి ముక్కలు చేసీ నూనెలో వేయించి పక్కన ఉంచాలి. వంకాయలకు గాట్లు పెట్టి వేయించాలి.

నూనెలో జీలకర్ర వేసి వేగాక దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి పచ్చి బఠణి, అల్లంవెల్లులి పేస్టు, టొమాటో ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేశాక పక్కన ఉంచిన బంగాళాదుంప, వంకాయలను వేసి, జీలకర్ర పొడి చల్లి సన్న మంట మీద మసాల అంతాముక్కలకు పట్టేదాక ఉడికించాలి.

చివరిగా నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.


[ వెనుకకు ]

‌‌మార్వారి దాల్

కావలసిన వస్తువులు:

‌‌పెసరపప్పు - 50 గ్రాములు.
‌కందిపప్పు - 50 గ్రాములు.
‌‌మసూర్ దాల్‌ - ‌50 గ్రాములు.
‌టొమాటో - 75 గ్రాములు.
‌ఉల్లిపాయలు - ‌75 గ్రాములు.
ఎండు మిర్చి - 5 గ్రాములు.
‌‌పసుపు - 10 గ్రాములు.
‌బిర్యానీ ఆకు - 3.
‌‌ధనియాల పొడి - ‌10 గ్రాములు.
‌మిర్చి పొడి - 10 గ్రాములు.
‌వెల్లుల్లి - ‌10 గ్రాములు.
అల్లం వెల్లుల్లి పేస్టు - 10 గ్రాములు.
‌‌కొత్తి మీర - 10 గ్రాములు.
‌వెన్న - 50 గ్రాములు.
‌‌జీలకర్ర - ‌5 గ్రాములు.
‌ఉప్పు - రుచికి తగినంత.

తయారు చేసే విధానం:

ఉల్లిపాయలు, టొమాటోలను చిన్న ముక్కలగా తరగాలి. వెల్లుల్లి, కొత్తిమీరను సన్నగా తరగాలి. పప్పును ఉడికించి, అందులో బిర్యానీ ఆకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి అన్నీ మరికొంత సేపు ఉడికించాలి.

పప్పు పుర్తిగా ఉడికిందని నిర్ధారించుకున్నాక టొమాటో ముక్కలు, ఉప్పు కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి. పాత్రలో వెన్న వేసి కాగిన తర్వతా జీలకర్ర వేసి చిటపటలాడాక తరిగిన వెల్లుల్లి వేసి మగ్గనివ్వాలి.

ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ముదురు రంగు వచ్చేదాకా వేయించి ధనియాలపొడి కలపాలి.

చివరగా ఎండుమిర్చి, కొత్తిమీర, మిర్చిపొడి వేసి దించి పప్పు వేసి కలపాలి.


[ వెనుకకు ]

షాహీ ఖీర్‌

కావలసిన వస్తువులు:

‌‌బియ్యం - 50 గ్రాములు.
‌పాలు - 1 లీటరు.
‌‌యాలకుల పొడి - ‌5 గ్రాములు.
చక్కెర - 100 గ్రాములు.
నెయ్యి - ‌50 గ్రాములు.
సన్నగా తరిగిన బాదం - ‌10 గ్రాములు.
సన్నగా తరిగిన పిస్తా - 10 గ్రాములు.
కిస్‌మిస్‌ - 25 గ్రాములు.
జీడిపప్పు - 50 గ్రాములు.

తయారు చేసే విధానం:

బియ్యాని కడిగి అరగంట సేపు నాననివ్వాలి. పాలను వెడల్పుగా ఉన్న పాత్రలో పోసి అర లీటరు అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు బియ్యాన్ని వేసి ఉడికించాలి.

ఏలకుల పొడి, చక్కెర వేసి కరిగే దాకా కలుపుతూ ఉడికించాలి. మరొక పాత్రలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించాలి. చివరిగా బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో గార్నిష్ చేయాలి.


[ వెనుకకు ]

‌‌దామ్‌ క్యాప్సికమ్‌

కావలసిన వస్తువులు:

‌‌క్యాప్సికమ్‌ - అరకేజీ.
‌నూనె - వేయించడానికి.
‌‌తురిమిన పనీర్‌ - ‌‌300 గ్రాములు.
జీడిపప్పు - 100 గ్రాములు.
‌కిస్‌మిస్‌ - 100 గ్రాములు.
‌‌ఏలకుల పొడి - ‌‌30 గ్రాములు.
కొత్తి మీర - 50 గ్రాములు.
‌పచ్చిమిర్చి - 50 గ్రాములు (తరగాలి).
‌‌ఉప్పు - ‌‌తగినంత.
కాశ్మీరీ మిర్చిపౌడర్ - 50 గ్రాములు.
‌ఇంగువ - 5 గ్రాములు.
‌‌ఏలుకల పొడి - ‌‌30 గ్రాములు.
పెరుగు - 150 గ్రాములు.
‌నెయ్యి - 50 గ్రాములు.
‌‌ఉప్పు - ‌‌తగినంత.

తయారు చేసే విధానం:

క్యాప్సికమ్‌ గాట్లు పెట్టి గింజలను తీసి నూనెలో వేసి సన్నమంట మీద డీప్‌గా ఫ్రై చేసి పక్కన ఉంచాలి.

స్టఫింగ్ కోసం తీసుకున్న వాటిని కలిపి క్యాప్సికమ్‌లో కూరాలి. మరొక పాత్రలో నెయ్యి వేడి చేసి ఇంగువ, పెరుగు వేసి కలిపి స్టఫ్‌ చేసిన క్యాప్సికమ్‌తోపాటు గ్రేవీకి తీసుకున్న పదార్ధాలన్నింటినీ సన్న మంట మీద మగ్గనివ్వాలి.

దీనికి పావులీటరు నీటిని కలిపి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. మంట తగ్గించి మరో రెండు నిమిషాలపాటు ఉడికించి చివరగా మెంతిపొడి, కొత్తిమీర చల్లి దించాలి.


[ వెనుకకు ]

‌‌ఉలుంద్రా

కావలసిన వస్తువులు:

‌‌బియ్యం - 100 గ్రాములు.
‌మినపప్పు - 40 గ్రాములు.
‌‌నూనె - ‌20 ml.
నెయ్యి - 50 ml.
జీడిపప్పు - 75 గ్రాములు.
ఎండుమిర్చి - 15.
‌‌పచ్చిమిర్చి - 4.
‌ఇంగువ - చిటికడు.
‌‌జీలకర్ర - ‌1 టీ స్పూన్‌.
కిస్‌మిస్‌ - 25 గ్రాములు.
ఉప్పు - తగినంత.
కరివేపాకు - 4 రెమ్మలు.

తయారు చేసే విధానం:

అన్నాన్ని కాస్త పలుకుగా వండి పక్కన ఉంచాలి. వెడల్పుగా ఉన్న పాత్రలో ఆయిల్‌ వేసి కాగిన తర్వాత మినపప్పు, ఎండుమిర్చి వేసి దోరగా వేగిన తర్వాత, పచ్చిమిర్చి ముక్కలు, కొబ్బరి తురుమును వేసి సన్న మంట మీద వేయించాలి.

బాణలిలో నెయ్యి వేసి కాగినతరవాత ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కిస్‌మిస్‌ వేసి వేయించి ఈ మిశ్రమాన్ని ముందు వేయించిన కొబ్బరి మిశ్రమంతో కలపాలి.

అందులో అన్నం, ఉప్పు వేసి సమంగా కలిపి, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: