|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఈ వాలెంటైన్స్ డేకు ప్రత్యేకంగా ఏదైనా స్వీట్ చేద్దామనిపిస్తోందా... అయితే, ఈ ఫిగ్స్‌ట్రీట్ చేసి చూద్దామా.. తయారీ విధానం కూడా సులువే. వెనీలాఇస్‌క్రీముతో కలిపి తింటే వీటి మజాయే వేరు.
కావలసిన వస్తువులు:
|
పాలపొడి |
- |
అరకప్పు |
|
కండెన్స్‌డ్ మిల్క్ |
- |
రెండుటేబుల్ స్పూన్లు |
|
ఐసింగ్ షుగర్, కోకోపొడి, తాజా వెన్న |
- |
ఒక్కోస్పూను చొప్పున |
|
అంజూర్(బేకరీల్లో లభిస్తాయి) తరుగు |
- |
ఒక పెద్దస్పూను |
|
బాదంపప్పులు |
- |
గుప్పెడు |
తయారుచేసేవిధానం:-
ఓ వెడల్పాటి గాజు బౌల్ తీసుకుని అందులో పాలపొడి, కోకోపౌడర్, వెన్న, ఐసింగ్ షుగర్ అన్నీవేసి పాలుపోసి చక్కగా గట్టిగా చపాతీల పిండిలా కలపండి. ఆ మిశ్రమానికి అంజూర్ తరుగును చేర్చండి. ఇప్పుడు వెడల్పాటి గాజుట్రే తీసుకుని దానికి కాస్త వెన్నరాసి... అందులో ఈ మిశ్రమాన్ని సమంగా సర్ధండి. గట్టిగా కేక్‌లా ఉండే ఈ మిశ్రమాన్ని చక్కని షేపులో ముందుగానే సన్నని కత్తితోకోసుకుని వాటిపై బాదం పప్పులను అలంకరించండి. ఇప్పుడీ ట్రేను డీప్‌ఫ్రీజర్‌లో పెట్టేయండి. సరిగ్గా పావుగంట తర్వాత తీసి... దానికి వెనీలా ఐస్‌క్రీమును జోడించి వడ్డించేయండి.
ఎంతో బాగుందీ.. వాలంటైన్‌డే స్వీట్.. అంటూ మీ అతిధులంతా ప్రశంసలు కురిపించడం ఖాయం.
కావలసిన వస్తువులు:
|
గోభీ పువ్వు (చిన్నది) |
- |
1 |
|
ఆలు |
- |
2 |
|
లావు అటుకులు |
- |
250 గ్రా |
|
పచ్చి మిర్చి (తరిగినవి) |
- |
6 |
|
కరివేపాకు |
- |
2 రెమ్మలు |
|
కొత్తిమీర |
- |
2 రెమ్మలు |
|
ఆవాలు |
- |
5గ్రా |
|
జీలకర్ర |
- |
5 గ్రా |
|
ఎండుమిర్చి |
- |
3 |
|
పసుపు |
- |
అర టీ స్పూను |
|
ఉప్పు రిఫైండ్ ఆయిల్ |
- |
సరిపడినంత |
|
పచ్చి కొబ్బరి తురుము |
- |
కొద్దిగా |
తయారు చేసే విధానం:
కడాయిలో నూనె వేడి చేసి పప్పు దినుసులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు వరసగా కాక గోభీ, ఆలు ముక్కలు వేసి కలిపి సన్నని సెగపై ఉడికించాలి. అటుకులను కడాయిలో వేసి 5 నిమిషాలపాటు సన్నని సెగపై ఉడికించాలి. కడాయి దింపే ముందు తరిగిన కొత్తిమీర, కొబ్బరి తురుము, పైన జల్లి వేడివేడీగా వున్నప్పుడే స్నాక్ గా అతిధులకు అందించండి.
కావలసిన వస్తువులు:
|
పచ్చి కందిగింజలు |
- |
ఒక కప్పు |
|
టమాటాలు |
- |
పావు కిలో |
|
మెంతి ఆకు |
- |
ఒక కప్పు |
|
ఉల్లిపాయ |
- |
ఒకటి |
|
కారం పొడి |
- |
రెండు టీస్పూన్లు |
|
అల్లం వెల్లుల్లి పేస్టు |
- |
అర టీస్పూను |
|
కరివేపాకులు |
- |
పది |
|
పసుపు |
- |
పావుటీస్పూను |
|
గరం మసాలా |
- |
పావు టీస్పూను |
|
కొత్తిమీర తురుము |
- |
అరకప్పు |
|
ఉప్పు, నూనె |
- |
సరిపడినంత |
|
పంచదార |
- |
చిటికెడు |
తయారుచేసే విధానం :- మూకుడులో నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతి ఆకు, కారంపొడి, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత కంది గింజలు, పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు, తగినంత ఉప్పు వేసి కొంచెం సేపు వేగాక తర్వాత టమాటో ముక్కలు, పంచదార వేసి ఉడికించాలి. సన్నటిమంట మీద కాసేపు ఉంచాక తరిగిన కొత్తిమీర వేసి దించాలి.
గుమ్మడమ్మా గుమ్మడి
ఇది గుమ్మడి కాయల సీజన్. పల్లెల్లో పండగనెలలో గొబ్బెమ్మల మీద పెట్టడానికి గుమ్మడి పూల కోసం తమ పెరట్లో గుమ్మడిపాదులు వేసే ఉంటారు. ఈ సారికి గుమ్మడి పిందెలన్నీ కాయలుగా మారి దాదాపు మార్చి, ఏప్రిల్ వచ్చేసరికి వడియాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. బూడిద గుమ్మడితో వడియాలు పెట్టుకోవడమే తెలుసు చాలామందికి. కాని ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బూడిద గుమ్మడితో కూర చేసుకోవచ్చు. స్వీటు, వరుగులు కూడా చేసుకోవచ్చు. అవెలానంటే...
కావలసిన వస్తువులు:
|
బూడిద గుమ్మడికాయ |
- |
ఒకటి |
|
పచ్చికొబ్బరిచిప్ప |
- |
ఒకటి |
|
టమాటోలు |
- |
పావుకేజి |
|
పచ్చిశనగపప్పు |
- |
ఒక గరిటెడు |
|
కందిపప్పు |
- |
వంద గ్రాములు |
|
ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు |
- |
ఒక స్పూను చొప్పున |
|
కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి |
- |
తగినన్ని. |
తయారుచేసే విధానం :- మొదట గుమ్మడికాయను చెక్కుతీసి, గింజలన్నీ తిసివేసి చిన్నముక్కలుగా తరగాలి. పచ్చిశనగపప్పు కొంచెం నాననిచ్చి, గుమ్మడికాయ ముక్కలతో పాటుగా ఉడికించాలి. కందిపప్పుని విడిగా ఉడికించి పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి, చిటికెడు జీలకర్ర, పచ్చిమిర్చిలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉడికిన కందిపప్పుతో పాటు, రుబ్బిపెట్టుకున్న మిశ్రమాన్ని కూడా ఉడుకుతున్న గుమ్మడికూరలో వేసి బాగా కలియబెట్టి పదినిమిషాల పాటు ఉంచి దించాలి.
స్టౌ మీద బాణలి ఉంచి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ వేసి తాలింపు పెట్టి కూరలో కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తే ఘుమఘుమలాడే గుమ్మడికూటు సిద్ధం. ఇది అన్నంలోకే కాక దోశ, చపాతీ వంటి టిఫిన్లలోకి కూడా బాగుంటుంది.
కావలసిన వస్తువులు:
బూడిద గుమ్మడికాయ, పసుపు, ఉప్పు.
చేసేవిధానం:- మొదట బూడిదగుమ్మడికాయను చెక్కుతో పాటే బాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ తరిగిన ముక్కలన్నిటినీ ఉప్పు, పసుపు వేసి జాడిలో పెట్టుకుని ఒక రోజంతా నాననివ్వాలి. మరుసటి రోజు గట్టిగా మూతపెట్టి కావలసినప్పుడు నూనెలో దోరగా వేగించుకొని కొద్దిగా ఉప్పు కారం చల్లుకోవాలి. సాంబారులోకి, పప్పు కూరల్లోకి ఈ చిప్స్ చాలా రుచిగా ఉంటాయి.
కావలసిన వస్తువులు:
|
లేతవంకాయలు |
- |
200గ్రాములు |
|
గోరుచిక్కుళ్లు |
- |
50గ్రాములు |
|
బంగాళాదుంపలు |
- |
100గ్రాములు |
|
క్యారెట్ |
- |
రెండు దుంపలు |
|
మునక్కాయలు |
- |
6 |
|
చింతపండు |
- |
25గ్రాములు |
|
కందిపప్పు |
- |
100గ్రాములు |
|
బియ్యం |
- |
1కిలో |
|
రిపైండ్ ఆయిల్ |
- |
100గ్రాములు |
|
ఎండుమిర్చి |
- |
6 |
|
నెయ్యి |
- |
గరిటెడు |
|
లవంగాలు |
- |
10 |
|
దాల్చినచెక్క, ఉప్పు, పసుపు, కరివేపాకు |
- |
తగినంత |
|
పచ్చి శనగపప్పు |
- |
50గ్రాములు |
|
ధనియాలు |
- |
1స్పూన్. |
తయారుచేయువిధానం:- ముందుగా కూరగాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. బాణలిలో రిపైండ్ ఆయిల్ వేసి, కొంచెం కాగాక తరిగిన కూరముక్కలు అన్నీ వేసి రెండు గ్లాసుల నీళ్లు పొయ్యాలి. పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. బియ్యం, కందిపప్పు కుక్కర్‌లో విడివిడిగా పెట్టి ఉడకనివ్వాలి. శనగపప్పు, మిర్చి, మసాల దినుసులు అన్నీ దోరగా వేగించి పొడిచేసుకోవాలి.(సూపర్ మార్కెట్లో బిసిబాళాబాత్ పౌడర్ ప్యాకెట్ అమ్ముతారు. అదైతే ఒకటి నాలుగు సార్లకు వాడుకోవచ్చు) వెడల్పాటి గిన్నెలో అన్నం, పప్పు, ఉడికిన కూరముక్కలు, వేగించిన పొడి అన్నీ వేసి, చింతపండు బాగా నీళ్లగా పిసికిపోసి ఉప్పు, నెయ్యి, పసుప్పొడి వేసి గరిటెజారుగా ఉండేట్లు చేసి, స్టౌమీద కొద్దిసేపు ఉంచాలి. దింపేముందు నెయ్యితో పోపు, కరివేపాకు వేసి కలపాలి. వేడివేడిగా తింటే బాగుంటుంది.
కావలసిన వస్తువులు:
|
గుమ్మడికాయ |
- |
250 గ్రా. |
|
శనగపిండి |
- |
1 కప్పు. |
|
పచ్చిమిరపకాయ ముక్కలు (చిన్నవిగా తరగాలి) |
- |
2 టేబుల్ స్పూన్లు. |
|
తురిమిన అల్లం |
- |
1 టేబుల్ స్పూను. |
|
కారం |
- |
చెంచా సగం. |
|
తినే సోడా |
- |
చిటికెడు. |
|
తురిమిన చీజ్ |
- |
ఒక టేబుల్ స్పూను. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
నూనె |
- |
సరిపడినంత. |
తయారు చేసే విధానం:
మొదట గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలుగా, సన్నని స్లైసుల్లా కట్ చేసుకోవాలి. మిరపకాయలు, అల్లం, సోడా, కారం లాంటి మసాలాలన్నింటిని శనగపిండిలో వేసి నీరు కలిపి బజ్జీల పిండిలా చేసుకోవాలి. తరువాత గుమ్మడికాయ ముక్కను ఈ పిండిలో ముంచి నూనెలో వేసి వేయించండి. ఇలా బంగారు రంగు వచ్చేవరకు ఉంచి నూనెలో నుండి తీసేయండి. ఈ గుమ్మడి కాయ బజ్జీలను వేడివేడిగా సాస్ తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in