telugudanam.co.in

      telugudanam.co.in

   

కాఫీ

కాఫీ

కాఫీ మొక్క గింజల నుండి తయారుచేయబడే వేడి పానీయం. కాఫీ దాక్షిణాత్యులకు అత్యంత ప్రియమైన పానీయం. మొత్తం ప్రపంచంలో కాఫీని అతి ఎక్కువగా వాడే దేశాలలో ఒకటిగా మన దేశం గుర్తింపబడుతోంది. ప్రాధమికంగా ఇది పాశ్చాత్యుల పానీయం. గ్రీన్ కాఫీ అన్నది ఒక ప్రత్యేక రకము. దీన్ని చాలామంది అమెరికన్లు ఇష్టపడతారు. 13వ శతాబ్దంలో కాఫీ గింజల నుండీ రుచికరమైన పానీయాన్ని అరబ్బులు తొలిసారిగా తయారుచేశారు. కారణాలు అవీ ఇవీ అని ఖచ్చితంగా చెప్పలేముగానీ చాలాకాలం వరకు కాఫీ ఉత్పత్తిని చాలా రహస్యమైన వాణిజ్య రహస్యంగా ఉంచారు. ఎలాగైతేనేమి కొంతకాలం తరువాత నెదెర్లాండ్స్‌కు చెందిన డచ్ వారు రహస్యంగా కొన్ని కాఫీ మొక్కలనూ, గింజలనూ మధ్యధరా సముద్రాన్ని దాటించారు. ఆ తరువాత వాటిని వృక్షశాస్త్రపరమైన తోటలలో ఒక విచిత్రమైన మొక్కగా ప్రదర్శిస్తూ వచ్చారు.

ప్రధమంగా అరేబియాలో ప్రవృద్ధి చెందిన కాఫీ నేడు ఒక ముఖ్య వాణిజ్య పంటగా అన్ని ఉష్ణ మండల ప్రదేశాలలోనూ పండించబడుతూంది. కాఫీ అనే లాటిన్ పేరు "చేదు" అని అర్ధమిచ్చే కోవా లేక ఖావా అనే అరబిక్ పేర్ల నుండి ఏర్పడింది. భారతదేశంలో ఇది సి.అరబికా-చిక్స్, కూర్గ్స్, కెంట్స్ అనే మూడు ఉపజాతులుగా ప్రవృద్ధి పొందింది.

కాఫీ ఈ రోజు కాఫీని అతి భారీ ఎత్తులో ఎగుమతి చేస్తున్న బ్రెజిల్ కొన్ని కాఫీ మొక్కలను సంపాదించడానికి నానా కష్టాలను పడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పటికి కాఫీ మొక్కలను పెంచే ఏ దేశం కూడా కాఫీని ఎలా పెంచాలన్న దాన్ని రహస్యంగా ఉంచారేగానీ బ్రెజిల్‌తో పంచుకోలేదు. అయినా 1927లో అది కాఫీ ఉత్పత్తి రహస్యాలను చేదించగలిగింది. దక్షిణ అమెరికాకు ఆగ్నేయ దిశలో ఉన్న డచ్ గయానాకూ, ఫ్రాన్స్‌కూ మధ్య వచ్చిన సరిహద్దు తగాదాను తీర్చేందుకు బ్రెజిల్ సైన్యపు లెఫ్టినెంట్ ఫ్రాన్సిస్కో డిమోలో పంపబడ్డాడు. అతడు తనకు అప్పగించబడిన పనిని విజయవంతంగా సాధించాడు. అతడి పనిని ప్రశంశిస్తూ అతనికొక పూలగుచ్చం ఇవ్వబడింది. అది అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందులో కొన్ని సారవంతమైన కాఫీ గింజలు అలా ఉండడమే. అది బ్రెజిల్ వారు ఎదురుచూడని బహుమతి. ఇది ఈరోజు బ్రెజిల్ కాఫీ మొక్కలను పెంచి కాఫీ గింజలను మొత్తం ప్రపంచానికి ఎగుమతి చేయడానికి రాచబాటను వేసింది. ఈ రోజు కాఫీ పరిశ్రమ బ్రెజిల్‌కు చెందిన దినదినాభివృద్ది చెందుతున్న పరిశ్రమ.

కాఫీ చెట్లు వాడని పచ్చదనాన్ని కలిగిన చిన్న చెట్లు. ఇవి సాధారణంగా కొండ ప్రాంతాల్లో నాటబడతాయి. ఇవి 3-9 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. ఇవి సామాన్యంగా సంవత్సరానికి ఒకసారి ఆకుపచ్చ గింజల రూపంలో వికసిస్తాయి. ఎనిమిదవ సంవత్సరంలో ఇది వాణిజ్యమైన మంచి దిగుబడిని ఇవ్వగలుగుతుంది. కాఫీ పానీయాన్ని తాగుతున్నప్పుడు అందులో ఉన్న కెఫిన్ (ఆల్కలాయిడ్) మనకు కావలసిన ఉత్సాహాన్నిచ్చి మానసిక స్థితిని ఒక ఉచ్చ దశకు తీసుకెళ్తుంది. అందులో ఉన్న మరో వస్తువు కాఫీయోల్ చాలా హాయినిచ్చే రుచి సువాసలనలు కాఫీకి అందజేస్తుంది. కాఫీకి చికోరీ చేర్చడం వలన ఒక విధమైన రుచి వస్తుంది.

కాఫీ తయారీని శీఘ్రతరం చేయవలసిన ఆగత్యం ఏర్పడడం వలన అమెరికాలోని చికాగో నగరంలోని సర్తురి కటు అనే శాస్త్రజ్ఞుడు 1901లో ఇన్స్టెంట్ కాఫీని కనుగొన్నాడు. ఈ రోజు ఈ ఇన్‌స్టెంట్ కాఫీ మొత్తం ప్రపంచంలోనే మంచి ప్రచారాన్ని పొందింది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: