telugudanam.co.in

      telugudanam.co.in

   

మన శరీరానికి నీరు ఎందుకు అవసరం ?

మానవ శరీరంలో సుమారు అరవైశాతం ఉండేది నీరే. మనిషి శరీరాన్ని ఒక నిమ్మకాయలా పిండితే కనీసం 50 లీటర్ల నీరు బయటకు వస్తుంది. ఇది మామూలు నీరు కాదు. ఈ నీరు మన శరీరానికి ఎంతో అవసరమయ్యే

పోషక పదార్ధాలను కలిగి ఉంటుంది. 3.7 లీటర్ల నీరు రక్త నాళాల నుండి గుండెకు సరఫరా అవుతుంది. ఈ నీరు రక్త కణాలను ఒక క్రమ పద్దతిలో శుభ్రం చేస్తూ ఉంటుంది. మీరు రోజంతా నీరు తాగకపోయిన మీరు తినే

ఆహారం ద్వారా ఒక లీటరు నీటిని తీసుకుంటారు. అంటే పళ్ళు, కూరగాయలు, బ్రెడ్డు, మాంసం మొదలైన పదార్ధాల ద్వారా మీ శరీరానికి నీరు అందుతుంది. సగటున ఒక వ్యక్తి కనీసం 2 లీటర్ల నీటిని ద్రవాల ద్వారా

తీసుకుంటాడు. ప్రతి రోజు శరీరంలోపల, అవయవాల మధ్య 10 లీటర్ల నీరు ప్రవహిస్తూంటుంది. ఉదాహరణకు మీరేదైనా ఆహారం తినేటప్పుడు లాలాజలాన్నికూడా మింగుతారు. అప్పుడు వెంటనే మీ రక్తనాళాలలోని

కొంత నీరు తిరిగి లాలాజల గ్రంధిలోకి చేరుతుంది. మీరు ఇంతకుముందు తీసుకున్న ఈ నీరు కడుపులోకి వెళ్ళి మళ్ళీ రక్తనాళాలలో కలిసిపోతుంది. మీరు నీరు తాగినా తాగకపోయినా మీ శరీరంలోని నీరు ఒక్కటే!

అంటే మీరు అదనంగా తాగే నీరు మీ అవయవాల్లో ఉంటుందన్నమాట.


మూలం : 23-10-08, గురువారం, సాక్షి, ఫ్యామిలి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: