telugudanam.co.in

      telugudanam.co.in

   

మోటారు కారు కధ

మోటారు కారు

13వ శతాబ్దంలోనే శాస్త్రజ్ఞులు, కవులు, రచయితలు, పరిశోధకులు ఆటోమొబైల్‌ను గురించి అనేక కలలు కన్నారు. కలలన్నీ నిజాలుగా మార్చడానికి ఆటోమొబైల్‌ రంగంలో శ్రీకారం చుట్టడానికి ఫ్రెంచి మార్గదర్శకుల అపూర్వమైన అభినివేశము, పట్టుదల ముఖ్య కారణం అని చెప్పకతప్పదు. మోటరు కారు రోడ్డుమీద తిరగడానికి మోళికంగా చక్రాలు ముఖ్యమైన, వేగం సాధించాలనే ఉబలాటమే దీని అభివృద్దికి ముఖ్య కారణమైంది. 1475వ సం.ప్రాంతంలో దానంతట అదే తిరిగే మొట్టమొదటి యంత్రం 'మస్కులశ్ కనిపెట్టబదింది. ఆ తరువాత 1769వ సం.లో ఫ్రెంచి దేశీయుడైన జోనఫ్ కగ్ నాట్ మొట్టమొదటి మోటరు వాహనం నిర్మించాడు. ఇది ముఖ్యంగా ఆవిరి సహాయంతో తిరిగే 3 చక్రాల యాంత్రిక వాహనం. ఆ తరువాత ప్రపంచంలో 'గ్యశ్ సహాయంతో తిరగగల ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్‌తో మొదటి కారుని ఎటిన్నే లెనాయిర్ ( Ettenne Lenon) నిర్మించాడు.

బ్యూడి రొచాస్ (Beaude Rochas ) అనే మరో ఫ్రెంచి శాస్త్రజ్ఞుని నవ్య కల్పనలు అసలు ఫ్రాన్స్ లోనే ఎవ్వరికి తెలియలేదు. ఇతడే మొట్టమొదటి మోటారుకారు మెకానిక్స్ ప్రాధమిక సూత్రాలను నిర్ణయించిన మేధావి. తిరిగి మరో ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు ఫెర్నాండ్ ఫోరెస్ట్ (Fernand Forest) కారుకి మొట్టమొదట పెట్రోలు ఉపయోగాన్ని ప్రదర్శించాడు. ఆ తరువాత 1894వ.సం.లో. జీన్ ట (Jeantaud) విద్యుచ్చకి సహాయంతో తిరిగే మొదటి కారును నిర్మించాడు. ఇవి నాటినుండి 20 సంవత్సరాలదాకా ప్రచారంలోకి రాలేదు. రైల్వే స్టెషనులోను పెద్దపెద్ద ఫ్యాక్టరీలలోను మాత్రమే ఉపయోగించబడేవి. వీటి బ్యాటరీల శక్తి తక్కువగా ఉండటమే దీనికి ముఖ్యకారణం. ఈ సమయంలో విద్యుచ్చక్తి సహాయంతో కారు నిర్మించి గంటకి 100 కి.మీ.వేగాన్ని పొందిన జెనట్జిని (Jenatzy ) స్మరించక తప్పదు.

మోటారు కారు 1871వ సం.వరకు ఆవిరి సహాయంతో తిరిగే స్టీము ఇంజను కార్లకు, ఇంటర్నల్ కంబస్టన్ ఇంజను కార్లకు అంత పోటీ ఏర్పడలేదు. అంతకుముందు 40 సంవత్సరాలుగా బాగా ప్రచారంలో ఉన్న ఆవిరి యంత్రాలు వాటి ఉపయోగాన్ని గురించి ప్రజానీకం బాగా గుర్తించింది. ఇదే 1828వ సం.లో రైల్వే పరిశ్రమలకు దోహదం ఇచ్చింది. ఆ కారణంచేతే ఆవిరి యంత్రంతో నడపబడే మోటారుకారులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. మోటారు కారు చరిత్రలో బోలీ (Bollee) కుటుంబాన్ని విస్మరించలేం. అమొడి బోలీ (Amedee Bollee) మోటారుకారు నియంత్రణా విధానాన్ని పూర్తిగా రేఖాచిత్రం వేసి చూపించాడు. క్రొత్త క్రొత్త కల్పనలు చేసినవారు, క్రొత్త సాధనాలను కనిపెట్టిన వారు తమ సాధనాలతో, నవ్యకల్పనలతో బాగా డబ్బు చేసుకోగల రోజులు కావు అవి. బోలి కూడా బ్యూడి రోచస్ లాగే దారిద్ర్యంతో మరణించాడు.

ఇంటర్నల్ కంబస్టన్ ఇంజను నిలకడగా మైలేజిని ఇవ్వడంచేత అప్పటికి ఎక్కువగా స్టీం ఇంజను కార్లకు ఉన్నమోజు తగ్గిపోయింది. ఆవిరితో నడిచే మోటారు కారుకి జనాదరణ బాగా తగ్గిపోయింది. క్లిమెంట్, డిడిట్రెచ్, లాబుయర్, రెనాల్ట్, మొదలైన వారెందరెందరో ఇంటర్నల్ కంబస్టన్ ఇంజను సహయంతో మోటారుకార్లను నిర్మించారు. మొట్టమొదట కారు పందెం (Carrace )జూలై 22,1894న జరిగింది. ఈ పోటీలో ఫోన్ హార్డు, పిగాట్ అఖండ విజయాన్ని పోందారు. ఆనాటినుంచే ప్రజలు పెట్రొలు కారును ఎక్కువగా అభిలషిస్తూ వచ్చారు.ఫ్రాన్స్ లో ప్రతి సంవత్సరం కార్ల పొటీ జరిగేవి. దీనిని పురస్కరించుకుని ఆటోమొబయిల్ రంగంలో అభివృద్ధికి ప్రయోగాలు జరిగాయి. వీటి పరిశోధన రంగంలోను, నిర్మాణంలోను ఫ్రాన్స్‌దే ముందంజ. 1900 సం. తరువాత ఫ్రాన్స్ రోడ్ల మీద ఎక్కువ వేగంగల కొన్ని మోటారుకార్లు తిరిగాయి కాని 30 కి.మీ. వేగాన్ని అధిగమించినవారికి జరిమానాలు విధిస్తుండేవారు.

మోటారు కారు 1888వ.సం. తరువాత మోటారు ఇంజనును సైకిలుకు బిగించడానికి అనేక ప్రయత్నాలు కొనసాగాయి. వెర్నర్ ( Werner) సోదరులు 1897వ సం.రం పారిస్లో జరిగిన ప్రదర్శనలో మొదటి మోటారు సైకిలును ప్రదర్శించారు. 1888వ సం.లో డన్ లప్ టైరును కనిపెట్టాడు. డన్ లప్ టైరును కనుపెడితే మిచెలిన్ సోదరులు ఈ టైరును కారు చక్రాలకు ఉపయోగించే విధానాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. సాంప్రదాయకమైన ఎలాస్టిక్ చక్రాలకంటే రబ్బరు టైరులు చాలా కాలం మన్నుతాయి ఆని 12,000 కి.మీ.ప్రయాణంచేసి ప్రత్యక్షంగా నిరూపించారు.

20వ శతాబ్దపు ప్రధమభాగంలో కార్లను నడిపేటప్పుదు లేచే దుమ్ము బెడదను ముఖ్యంగా నివారించుకోవలసి వచ్చింది.1902వ సం.లో తారు, కొన్ను ఇతర వస్తువులు కలిపి రోడ్లు నిర్మిస్తే దుమ్ము లేవదని డా. గుగ్గ్లి మినెట్టి కనుగొన్నాడు. రోడ్ల నిర్మాణరంగంలో అనేక నూతన ప్రయోగాలు, పరిశోధనలు జరిగాయి. ప్రపంచం అంతటా తారు రోడ్లు వేయడానికి ప్రారంభించారు. పెట్రోలు ఇంధనంతో తిరిగే మోటారు కార్లు బాగా అభివృద్ది పొందుతాయి. కాని ఇంతలోనే ఇంధనం పొదుపు సమస్యలు అనేకం బయల్దేరాయి. ఫ్రాన్స్ లో ఎక్కువగా ఆల్కహాలు ఉత్పత్తి చేసి ఈ రంగంలో పరిశోధనలు తీవ్రంగా జరిపారు. ప్రపంచ యుద్ద సమయంలో పెట్రోలుకు బదులుగా అనేక ఇతర ఇంధనాలతో ప్రయోగాలు ఎన్నో కొనసాగాయి. కాని పెట్రోలును మించిన ఇంధనాన్ని కనుగొనలేకపోయారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: