telugudanam.co.in

      telugudanam.co.in

   

నేడు యుఎన్ఒ డే

'ఐక్య రాజ్యసమితి దినం'ను ప్రతిఏటా అక్టోబర్ 24 వ తేదీన జరుపుకుంటారు. సమితిసభ్య దేశాల్లోనే గాక, ప్రపంచమంతటా ఈ దినాన్ని పాటించడం విశేషం.

ఐక్యరాజ్యసమితి(ఐరాస) 1945 అక్టోబర్ 24 నుండి ఉనికిలోకి వచ్చింది. అంతకు ముందు జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి వ్యతిరేకంగా అనేక ప్రపంచ దేశాలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి, ఆ కూటమి నుంచి ఆవిర్భవించినదే ఐరాస.

1941 లో అప్పటి అమెరికా అధ్య్క్షక్షుడు ఫ్రాంక్లిన్‌ డి. రూజ్‌వెల్డ్, ఇంకా గ్రేట్ బ్రిటన్‌ ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ అట్లాంటిక్ చార్టర్ అనే తీర్మానంపై సంతకాలు చేశారు. ప్రపంచశాంతికి, అంతర్జాతీయంగా వివిధ దేశాలు పరస్పరం సహకరించుకోవటానికి సంబంధించిన కొన్ని సూత్రాలు సమాహరమే అట్లాంటిక్ చార్టర్ కాగా 1945లో 50 దేశాలకు చెందిన ప్రతినిధులు శాన్‌ఫ్రాన్సిస్కోలో సమావేశమై సమిష్టికృషితో ప్రపంచశాంతిని నెలకొల్పడంనిరక్షరాస్యతను, దారిద్ర్యాన్ని, వ్యాధులను, తీవ్రఅనారోగ్య సమస్యలను (సాధారణంగా యుద్ధాల మూలంగా ఇలాంటి సమస్యలను మరీతీవ్రమవుతాయి) లక్ష్యాలుగా చేసుకొని ఒక మౌలిక రాజ్యాంగం లాంటి దానిని రూపొందించారు.ఆ తరువాత ఇందులో అనేక మార్పుచేర్పులు చోటు చేసుకున్నప్పటికి, ఐరాస మాత్రం ప్రపంచశాంతికి, అభివృద్ధికి నిరంతరంగా కృషినిస్తూవుంది. ప్రపంచశాంతిని పరిరక్షించేందుకై ఐరాస వివిధ పద్ధతులను అనుసరిస్తూ, అమూల్యమైన కృషిచేస్తోంది.

ప్రపంచ శాంతి సౌభగ్యాలకై ఐరాస చేస్తున్నకృషిని, అంకితాభావాన్ని గుర్తుచేసుకంటూ ప్రతిఏటా ఓ రోజున "ఐక్యరాజ్యసమితి దినం"గా పాటించడంలో ఎంతైనా అర్ధం వుంది.


మూలం: 24-10-2008, ఫ్యామిలీ, సాక్షి...

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: