telugudanam.co.in

      telugudanam.co.in

   

పెన్సిల్ పుట్టిందిలా...

పిల్లలూ! మీకు బొమ్మలు గీయడం వచ్చునా? సరే, బొమ్మలు గీయటానికి ఏమేంకావాలో చెబుతారా? పెన్సిల్, రబ్బర్, కాగితమూ.. అంటున్నారా, సరిగానే చెప్పారు. ఈ రోజు మనం పెన్సిల్ పుట్టుక గురించి తెలుసుకుందాం.

జోసెఫ్ డిక్సన్ ఇంగ్లాండ్‌లో పుట్టాడు. చాలా పేదవాడు. ఇల్లు గడవటానిక ఒకచిన్న దుకాణంలో పనికి చేరాడు. యజమాని చెప్పింది గుర్తుపెట్టుకోవటానికి ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు బయటపడి ఉన్న ఓ నల్లరాయితో గోడమీద రాశాడు. అంతే! ఆ రోజు నుంచి ముఖ్యమైన విషయాన్ని గోడమీద ఆ నల్లరాయితో రాసేవాడు. ఆ రాయే 'గ్రాఫైట్'. డిక్సన్‌కు ఒక చిన్న ఆలోచన కలిగింది. ఆ రాయిని పొడిచేసి కాస్త ముద్దగా ఉండటానికి ఆముదంలాంటి పదార్ధాన్ని కలిపి, దాన్ని ఒక గొట్టంలోకి ఎక్కించి బాగా ఎండిన తర్వాత రాశాడు. బాగానే ఉంది. కానీ కాస్త బరువుగా ఉండి రాయడానికి అంతగా వీలుకాలేదు. చేతులు నల్లగా అయ్యేవి. చాలా ప్రయోగాలు చేశాడు. కొన్ని రోజులకు ఒక ఉపాయం తట్టింది.

ఒక సన్నని కొయ్య ముక్కని తీసుకుని దానికి ఒక చిన్న రంద్రాన్ని వేసి ముద్దగా ఉన్న గ్రాఫైట్‌ను నింపి బాగా ఎండిన తర్వాత రాశాడు. అద్భుతం! పెన్సిల్ తయారయింది. సన్నగా రాయడం, చేతులకు నలుపు అంటకపోవడం, వేగంగా రాయడం లాంటిది జరిగింది. మొదట్లో గుండ్రని పెన్సిళ్లు వచ్చేవి. తర్వాత మరెన్నో మార్పులతో నేడు పెన్సిల్ రకరకాలుగా ఉపయోగపడుతోంది. పెన్సిల్‌ని గ్రాఫైట్‌తో చేస్తారని మీకు అర్ధమైదికదూ. గ్రాఫైట్ అనేది కర్భన సమ్మేళనం. వజ్రం కూడా కర్భన పదార్ధమే. కానీ వజ్రానికి ఉన్న కఠినత్వం గ్రాఫైట్‌కు లేదు. మీకెప్పుడయినా పెన్సిల్ ఎందుకని పంచభుజి, అష్టభుజి రూపాల్లోనే ఉంటుంది? అనే సందేహం వచ్చిందా? ఒక కొయ్య ముక్కతో గుండ్రని ఆకారంలో ఉన్న పెన్సిల్ కంటే, పంచభుజి, అష్టభుజి రూపంలో ఎక్కువ పెన్సిళ్లను తయారుచేయవచ్చు. రకరకాల పెన్సిళ్లు మీకు అందు బాటులో ఉండడం వెనుక ఇంత కధ ఉంది. ఇప్పుడర్ధమైందా మరి.

కేలొరీ అంటే ఏమిటి? ఎలా కొలుస్తారు?

ఉష్ణశక్తిని కొలువడానికి కేలొరీలో కొలుస్తాం. ఉష్ణశక్తి యొక్క ప్రమాణాలు "కేలొరీ" అంటారు. ఒక గ్రాము నీటి ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ(సెల్షియస్)కు పెంచడానికి అవసరమైన ఉష్ణమును "కేలొరీ" అంటారు. దీనినే " గ్రామ్‌కేలొరీ" అని పిలుస్తారు. ఇలాగే ఒక కిలోగ్రాం నీటి ఉష్ణోగ్రతను ఒక సెంటిగ్రేడ్ డిగ్రీకి పెంచడానికి కావలసిన ఉష్ణమును కిలోకెలోరీ లేదా పెద్ద కేలొరీగా పిలుస్తారు.

మనం తీసుకునే ఆహర పదార్ధాలు జీర్ణమయ్యేటప్పుడు కలిగే ఉష్ణమును ఈ కిలోకేలొరీలో కొలుస్తాం. మనం ఆహరమును జీర్ణం చేసుకునేటప్పుడు ఉష్ణశక్తి పుడుతుంది. ఉదాహరణకు ఒక గ్రామ్ ప్రోటీను నుంచి నాలుగు కేలొరీలు, ఒక గ్రామ్ క్రొవ్వు నుంచి తొమ్మిది కేలొరీలు ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఈ కేలొరీల అవశ్యకత ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వుంటుంది. అంటే వారి వారి బరువు, వారు చేసేపనులు, వారివారి వయస్సుల బట్టి ఆధారపడివుంటుంది అని చెప్పవచ్చు. 8 సంవత్సరాలలోపు పిల్లలకు 500 కేలొరీలు, 8 సంవత్సరాల కంటే పెద్ద పిల్లలకు 1000 కేలొరీలు మహిళలకు 1300 కేలొరీలు, పురుషులకు, 1500 కేలొరీలు ప్రతిరోజు అవసరం. రోజుకు ఆరుగంటలు పనిచేసే వ్యక్తికి 2700 వరకు కేలొరీలు తప్పనిసరిగా అవసరం.

కేలొరీలు కావలసిన అవసరం కంటే ఎక్కువ అయినట్లయితే అవి శరీరంలో క్రొవ్వు రూపంలో వుంటుంది. మనం తీసుకొనే అన్ని ఆహారపదార్ధాల నుంచి మనకు ఉష్ణం కలుగుతుంది. ఇదే మనకు మానవయంత్రం పనిచేయడానికి ఒక ఇంధనం లాంటిది. ఉదాహరణకు 100 గ్రాముల బంగాళాదుంపలనుంచి 83 కేలొరీలు లభిస్తాయి. ఇదే విధంగా 100గ్రాముల చక్కెర నుంచి 394, 100గ్రా వెన్ననుంచి 793, 100 గ్రా గ్రుడ్ల నుంచి 155 కేలొరీల ఉష్ణం పుడుతుంది.

ఇంధనములను కాల్చటం ద్వారా పుట్టే ఉష్ణాన్ని కూడా కేలొరీలలోనే లెక్కిస్తారు. ఒక గ్రాము ఇంధనం కాల్చినపుడు ఉత్పత్తి అయిన ఉష్ణమును కేలొరీగా లెక్కిస్తారు. ఉదాహరణకు 12 గ్రాముల కార్బన్‌ను కాల్చినపుడు 94 కేలొరీల ఉష్ణం పుడుతుంది. దీని కేలొరీ విలువ 7.83 ((94/ 12) శాతం తగినన్ని కేలొరీలు లభించని ఆహారం తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి బరువు తగ్గుతుంది. మొతాదుకు మించి కేలొరీలు ఎంత అవసరమో తెలుసుకొని సమతూక ఆహరం తీసుకుంటే మన ఆరోగ్యం పది కాలాలపాటు పదిలంగా ఉంటుంది.


మూలం:- వార్త(చెలి) గురువారం9, ఫిబ్రవరి 2006

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: