telugudanam.co.in

      telugudanam.co.in

   

సౌకర్యం కోసం!

నలుగురూ నడవటం కోసం, సౌకర్యం కోసం రోడ్డు వేసీ వేయ్యగానే కొందరు పండుగ అవసరాల కోసం వెంటనే గోతులు తీసి రాటలు పాతేస్తారు. బోరింగు పంపు మీద కసరత్తు చేసి విరగ్గొడతారు. పరిశుభ్రత కోసం వుంచిన గదులు, గోడలు చెప్పనవసరం లేని స్థితిలో కనిపిస్తాయి. ప్రజలకి కోపం వస్తే ఆర్టీసి బస్సులు, టెలిఫోన్ బూత్ లూ పగిలిపోతాయి. పోస్ట్ డబ్బాలు పగలగొడతారు. ఇవి మన దేశం లో కనిపించే నిత్య దృశాలు.

కాని స్విట్జ్ర్ల ర్లాండ్ లో ఈ విషయంలో పరిస్థితి వేరుగావుంది.జెనీవాలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విభాగం వారు ప్రజల అవసరం కోసం అని 1250 సైకిళ్ళు వివిధ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. అంటే బస్సులు, రైళ్ళు, లాంచ్‌, బోటు, టాక్సీ వగైరాలు కాక కేవలం అతి సామాన్య జనం కోసం ఉంచారీ సైకిళ్ళు. ఇవి ఎర్ర రంగులో ఉంటాయి. వాటికి తాళాలు వుండవు. ఎవరైనా ఎప్పుడైనా సరే ఈ సైకిళ్ళను వాడుకోవచ్చు. ఐతే నగర సరిహద్దులను దాటి పోరాదని నిబంధన. పనైపోగానే తిరిగి ఆ ప్రదేశం లో సైకిలు వదిలివేయాలని మరో నిబంధన. గత పది సంవత్సరాలుగా ఆ సైకిళ్ళను ఎవరూ దొంగిలించలేదు! అవి ఇంకా క్షేమంగా నడుస్తున్నాయి. నిర్ణీత స్థలం లో మరొకరికి ఉపయోగపడేలాగ ఆ సైకిల్ ఉంచితే చాలు. నిజాయితీకి ఇదొక గొప్ప ఉదాహరణ!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: