telugudanam.co.in

      telugudanam.co.in

   

సున్నా కధ

మనకందరికి సున్నా తెలుసు. ఇది ఒకటికన్నా ముందు వస్తుంది. ఈ సున్నాను కనుగొనడం గణితశాస్త్రం మొత్తం మీద విప్లవాత్మక మైన మార్పు తెచ్చింది. సున్నా అనే భావన బాబిలోనియాలాంటి పలు పురాతన నాగరికతలలో కనిపించినప్పటికీ, మనం ఇవాళ ఉపయోగిస్తున్న చిహ్నం ఆ తరువాతి కాలం వరకు కనుగొనబడినది.

మద్య ఆసియా-భారత దేశాల మధ్య వర్తక వాణిజ్యా సంబంధాలు మనదేశానికి 'సున్నా' ను పరిచయం చేశాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. మాయాన్లు, బాబిలోనియన్లలాగనే భారతీయులు కూడా ఖాళీ స్థలాన్ని చూపడానికి '0' గుర్తును ఉపయోగిస్తున్నారు. అయినా క్రీస్తు శకం 9వ శతాబ్ధం నాటికి భారతీయులు 'సున్నానూ ఒక అంకెగా కూడా భావించడం ప్రారంభించారు. దీన్ని గణిత శాస్త్రంలో అతిపెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. ఒకటికన్నా తక్కువ అంకె ఉందనీ ఒకటి నుంచీ దానిని తీసివేస్తే సమాధానం లభిస్తుందనీ భారతీయులు కనుగొన్నారు. అప్పటినుంచి భారతీయుల సంఖ్యా విధానం మనం ఇవాళ అంకెలను గణిస్తున్నట్టు 10 మీద ఆధారపడి ఉంటుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: