telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

వయసుతో పని ఏముంది?

ఏ వయసుకా ముచ్చట అన్నారు పెద్దలు. అంటే ఏ వయసుకైనా ముచ్చట్లు ఉంటాయన్నది అందరూ ఒప్పుకుంటున్న విషయం అన్నమాట. మరి ఆ ముచ్చట్లు ఎలా ఉండాలి? చిన్న వయసువాళ్ళకైతే ఆటలు, పాటలు, అల్లరి. మధ్య వయస్కులకు ఆటలు, పాటలు, కబుర్లు. వృద్ధులకు కూడా ఆటలుంటాయి, పాటలుంటాయి, వాటితోపాటు వారు తలచుకుంటే అనేక రకాలైన ముచ్చట్లుంటాయి. వయసుకు తగ్గ ముచ్చట్లు అనేది ఉద్యోగం-సద్యోగాలకీ, పెళ్ళి పేరంటాలకీ సంబంధించినవని మన పెద్దోళ్ళ భావన. ఖాళీగా తిరగకుండా త్వరగా సంపాదనపరుడవైతే జీవితంలో త్వరగా స్థిరపడతావు, తద్వారా సరైన వయసులో వివాహం అవుతుందనేది దీని వెనుక ఉన్న నిగూఢమైన అర్ధం. ఆ రెంటి వరకైతే అది బాగానే ఉంది. ఐతే ముచ్చట్లకు వయసనేది ఉండదని ఉండదు. ముచ్చట్లు అంటే కేవలం కాలక్షేపం కబుర్లని అర్ధం కాదు. రిటైరైపోయాం కాబట్టి మాకింక పనేమీ లేదు అనుకొకూడదనీ, ఏదో ఒక సరదా అయిన పని చేస్తూ ఉంటే టైము పాస్ అవుతుందనీ తెలుసుకోవాలి. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా ఇప్పుడు చూద్దాం.


ఇప్పుడు నమ్ముతారా ఏ వయసుకైనా ముచ్చట్లు ఉంటాయని. అందుకే వయసు మీద పడిపోయిందని దిగులుపడిపోకుండ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే మనసుకి ఉల్లాసంగా ఉంటుందీ, ఆరోగ్యం కూడా బాగుంటుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం