telugudanam.co.in

      telugudanam.co.in

   

నిత్య జీవితం ఒక కళ

పుట్టిన క్షణం మొదలు మరణించేదాక సుఖదుఖాలతో దుర్ఘటమైన మన జీవితం అనేక సంక్షోభాలతో, సందిగ్ధాలతో, పోరాటాలతో, ఆరటాలతో, కష్ట పరంపరతో కూడి ఉంటుంది. జీవిత కళ అద్భుతమైన కళ.ఒక ముఖ్యమైన కళ. రాజకీయ వ్యవస్థకంటే, వార్తా ప్రసారాలకంటే బ్రహ్మాండమైన వ్యవస్థ.

ఇంత మహోత్కృష్టమైనప్పటికీ జీవిత కళ అంటాఎ ఏమిటో ఆమూలాగ్రంగా తెలుసుకోడానికి ఎప్పుడూ మనం ఉద్యమించలేదు. దీనికో క్రమం, విధానం, నియమం, రీతి అనేవి లేవు. చైతన్యవంతమైన మానసిక ఉద్య్మం దీనికి అవసరం. సుస్థిరమైన న్యాయ బుద్ధి వికసించాలి. మనలో ఎంతమంది న్యాయంగా ప్రవర్తిస్తున్నాం? మనం చెప్పేది ఒకటి, చేసేది ఒఇకటి. జీవిత కళను విమర్శించుకోవాలంటే మౌళికంగా అచంచలమైన, సుస్థిరమైన న్యాయబుద్ధి ఉండాలి. జీవిత కళను తెలుసుకోవడానికి నిష్కాపట్యమైన ప్రవర్తన ముఖ్యం; ఏదో విధంగా జీవించడం కాదు. సక్రమంగా శక్తి సామర్ధ్యాలకు అంతరాయాలు సంభవించకుండా వాస్తవికంలో జీవించాలి. మాయలో కాదు.

సమస్యలు, సందిగ్ధాలు, పోరాటాలు లేకుండా జీవించడం నేర్చుకోఅడం ముఖ్యం. సమస్యల వల్ల, పోరాటాల వల్ల అమూల్యమైన కాలం ఎంతో వృధా అయిపోతుంది. అసలు పోరాటాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అనే విషయం తెలుసుకోవాలి. అద్భుతంగా, సునిశితంగా, క్రమపద్ధతిగా సంస్కారవంతమైన పరిష్కారంతో జీవించగలిగితే నిత్య జీవితం ఒక దివ్య కళగా మారిపోక మానదు. మనం సందిగ్ధంలో, వివాదంలో జీవిస్తున్నాం. పెద్ద పెద్ద యోగులు కూడా ఏదో అయిపోవాలనే ఆరాటంలో మ్రగ్గిపోతుంటారు. కాబట్టే వారు సక్రమంగా జీవించలేకపోతున్నారు. ఉన్న పరిస్థితి నుండి ఉండాలనుకునే పరిస్థితికి మార్పు తెచ్చుకునే ప్రయత్నంలో కొంత వ్యవధి ఏర్పడుతుంది. ఆ వ్యవధిలో మానసికంగా పోరాటం ఆవిర్భవిస్తుంది. ఈ ఆందోళన వల్లే జీవితం తారుమారు అయిపోతుంది.

నిత్య జీవితం కళామయం చేసుకోవాలంటే నిర్భయంగా జీవించాలి. భద్రత లేదనే మానసిక ఆందోళన ఉండకూడదు. మరణ భీతి, ఏదో అవలేకపోయామనే ఆరాటం, నష్టపడిపోతామనే భయం మనసులో రాకూడదు. ఇటివంటి ఆందోళనల వల్ల పూర్తిగా, నిర్భయంగా జీవించడం సాధ్యమా? కాబట్టి భయమనేది ఎలా ఉంటుంది? భయానికి కారణమేమిటి? ఉన్న పరిస్థితులకు మార్పే భయానికి ఒక కారణం. భయానికి ముఖ్య కారణం యోచనా వ్యవధి.


- జిడ్డు కృష్ణమూర్తి

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: