telugudanam.co.in

      telugudanam.co.in

   

కఠోర పరిశ్రమతోనే కలల సాఫల్యం సాధ్యం

కఠోర పరిశ్రమ

మనము పని చేస్తేనే తప్ప ఏ విశిష్టతనీ సాధించలేము. కఠోరమైన పరిశ్రమ లేకుండా కలలు ఎన్నటికీ నిజంకావు. మనశేస్త్రాలలో ఇలాచెప్పబడినది. "కష్టపడి పనిచేసే వాణ్ణీ అద్రుష్టం వరిస్తుంది.బలహీన మైన మనస్సు కలవాళ్ళు మాత్రమే 'విధి తెచ్చిపెడుతుంది ' అని అనుకొంటారు. వట్టికోరికలే పనులను సాధించవు. ఒళ్ళు దగ్గరపెట్టుకొని, కష్టపడి పని చేయడం వల్లనేపనులు జరుగుతాయి, లక్ష్యాలు సాధించబడతాయి. నిద్రపోతున్న సిం హం నోటిలోకి జింక వచ్చిదూరదుకదా! స్వప్రయత్నంద్వారానే మనిషి అనుకొన్నది సాధించగలుగుతాడు. మనిషి స్వప్రయత్నంతో, పట్టు వదలకుండా కృషి చేయాలి." ధామస్ ఆల్వా ఎడిసిన్, "ఒక శాతం పుట్టుకతో వచ్చిన ప్రేరణ తోనూ, తొంభై తొమ్మిది శాతం చెమటోడ్చి పని చేయడం వల్లనూ ఒక మేధావి తయారవుతాడు" అని చెప్పాడు.

విజయ గాధలు చాలావున్నాయి. అందులో విశ్వవిఖ్యాత ఉపన్యాసకుడైన డెమొస్తనీస్ కధ ఒకటి. అతడంత గొప్ప ఉపన్యాసకుడు ఎలా అయ్యాడు? "నేనొక మంచి ఉపన్యాసకుడిని కావాలి" అన్న బలమైన కోరిక అతడికి ఉండేది. కానీ అతని కోరిక సులబంగా నెరవేరలేదు. అతడికి నత్తి ఉండేది. పైపెచ్చు సభలలో మాట్లాడడమంటే ఉన్న భయం వల్ల ఏకధాటిగా మాట్లాడలేక పోయాడు. అతని కంఠస్వరం నూతిలోనుంచి వినిపిస్తున్నట్లుండేది. ఇన్ని ఇబ్బందులున్నా అతడు విజయం సాధించాడు. వైద్యుల సలహా మేరకు చెకుముకి రాళ్ళ పూసలను నాలుక మీదపెట్టుకొని కష్టమైన మాటలను బిగ్గరగా, స్పష్టంగా పలకడాన్ని అభ్యాసం చేశాడు. సముద్ర తీరంలో నిలుచొని బిగ్గరగా పెద్ద గొంతుతో ఉపన్యాసాలు ఇచ్చేవాడు. రకరకాల విషయాలకు సంబంధించిన పుస్తకాలను రోజుకు 15 గంటల పాటు చదివి విఙ్ఞానపు గనిగా రూపొందాడు. ఉపన్యసించేటప్పుడు తాను కనపడే పధ్ధతిని, అభినయాన్ని చక్కగా సరిదిద్దుకోవడానికి తలుపులు బిగించుకొని, గదిలో నిలువుటధం ముందు నిలబడి ఉపన్యాసాలిచ్చేవాడు.

కఠోర పరిశ్రమ, చిత్తశుధ్ధితో చేసిన ప్రయత్నం చివరకు విజయాన్ని సాధించింది. అతడొక శక్తిమంతుడైన, ప్రతిభాశాలి అయిన ఉపన్యాసకుడిగా తయారయ్యాడు.నింగికి ఎగిరే కలలను కనండి. మీలో దాగి ఉన్న శక్తిని వెలికి తీసేందుకు కష్టపడి పనిచేయండి! నిరంతర కృషివలన విజయం తప్పక లభిస్తుంది.వివేకానంద స్వామి, "జయం సాధించాలంటే మీకు అమితమైన పట్టుదల, అమితమైన సంకల్ప శక్తి కావాలి. పట్టుదల కలిగిన వ్యక్తి, 'నేను సముద్రాలను త్రాగివేస్తాను, నాసంకల్ప శక్తితో కొండలను పిండి కొట్టగలను ' అంటాడు. అటువంటి శక్తినీ అటువంటి సంకల్పాన్ని కలిగి ఉండండి. కష్ట పడి పని చేయండి. మీ గమ్యాన్ని చేరుకొంటారు" అన్నారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: